RGV: CBN లక్కీ నెంబర్ 23..ఆర్జీవీ సంచలన ట్వీట్

RGV: CBN లక్కీ నెంబర్ 23..ఆర్జీవీ సంచలన ట్వీట్

సంచలన డైరెక్టర్ ఆర్జీవీ(Rgv) నుంచి వస్తోన్నలేటెస్ట్ మూవీ వ్యూహం(Vyooham). దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా వ్యూహం,శపథం టైటిల్స్తో రెండు పార్టులుగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. 

లేటెస్ట్గా ఆర్జీవీ..CBN లక్కీ నెంబర్  23 అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు జీవితంలో 23 అనే తేదికి సంబంధించి..ఇంత చరిత్ర ఉందా? అనుకునేలా సరైన డిటైల్స్ తో పోస్ట్ చేశాడు. 

1. వైసీపీ పార్టీ నుంచి బాబు లాక్కున్న MLA లు  23 మంది  

2.  2019 లో ఎన్నికల ఫలితాలు వల్ల తాను ఓడిపోయాను అని తెలుసుకున్న తేదీ 23. 

3. చంద్రబాబు గెల్చుకున్న ఎమ్మెల్యే స్థానాలు కేవలం 23 

4. బాబు అరెస్టయిన తేదీ 9-9-23.సమ్ అఫ్ అల్ దీస్ నంబర్స్  = 23

5. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2023 లో చంద్రబాబు సెప్టెంబర్  23 rd వరకూ జ్యూడీషియల్ రిమాండ్ ఇచ్చిన సీబీఐ కోర్టు. 
 
6. బాబు ఖైదీ నెంబర్ 7691 కాగా ఈ నంబర్స్ కూడితే వచ్చేది= 23

7. చంద్రబాబు నాయుడు సీనియర్ NTR దగ్గర నుంచి తను లాక్కున్న పార్టీకి వారసుడిగా చేద్దామనుకుంటున్న..ఆయన కొడుకు లోకేష్ పుట్టిన రోజు 23rd 

8.వ్యూహం సినిమా జగగర్జన ఈవెంట్  23. 

9.వ్యూహం సినిమా రిలీజ్ 23 rd

అని ఆర్జీవీ తనదైన శైలిలో చంద్రబాబు నాయుడు లక్కీ నంబర్ 23 అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

గతేడాది నవంబర్ 13 న రిలీజ్ కావాల్సిన మొదటి పార్ట్ వ్యూహం మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఇపుడు వ్యూహం మూవీ ఈ నెల (ఫిబ్రవరి 23న) రిలీజ్ అవుతుంది. సినిమాకు క్లియరెన్స్ వచ్చాక..రిలీజ్ డేట్ ప్రకటించడమే కాకుండా..వరుస ట్వీట్స్ చేస్తూ వర్మ తన అభిప్రాయాలను చెబుతూ వస్తున్నాడు.