Vijay and Trivikram: త్రివిక్రమ్తో విజయ్ చివరి సినిమా.. పొలిటికల్ పాయింట్తో మెప్పించాడట!

Vijay and Trivikram: త్రివిక్రమ్తో విజయ్ చివరి సినిమా.. పొలిటికల్ పాయింట్తో మెప్పించాడట!

తమిళ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబో సెట్ కానుందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అది కూడా తమిళ స్టార్ హీరో విజయ్(Vijay) తో. ఇంతకీ ఏంటా క్రేజీ కాంబో అనుకుంటున్నారా? అదే విజయ్ తలపతి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) కాంబో. అవును ఈ కాంబో ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు స్టార్స్ ఒక సినిమా కోసం కలిసి పనిచేయనున్నారట. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తమిళ స్టార్ విజయ్ తలపతి ఇటీవల కొత్త రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఆ వార్త తమిళనాట సంచలనంగా మారింది. ఇక అప్పటినుండి అందరి నోటా ఒకే ఒక మాట వినిపిస్తోంది. అదేంటంటే.. విజయ్ సినిమాలు తీస్తారా? ఆపేస్తారా అని. అవును ప్రస్తుతం తమిళ సినీ, రాజకీయ రంగాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే.. ప్రస్తుతం చేస్తున్న తలపతి 68 కాకుండా మరో సినిమా చేసి ఇండస్ట్రీ నుండి తప్పుకోనున్నాడట విజయ్. ఆ చివరి సినిమా కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఉండాలని ప్లాన్ చేస్తున్నాడట. 

అందుకోసం తెలుగు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అదిరిపోయే కథను రెడీ చేశారట. ఇటీవలే ఆ కథను విజయ్ కి వినిపించగా ఆయనకు బాగా నచ్చిందట ఆ కథ. వెంటనే ఒకే చెప్పేశాడట. పొలిటికల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారట. ఇక విజయ్ ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభుతో గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టీమ్) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయినా వెంటనే త్రివిక్రమ్, విజయ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. మరి విజయ్ కెరీర్ లో చివరి సినిమాగా వస్తున్న ఈ మూవీ ఎలాంటి కంటెంట్ తో రానుందో చూడాలి.