Game Changer: గేమ్ ఛేంజర్ రిలీజ్పై కన్ఫ్యూజన్.. మళ్ళీ వాయిదా తప్పదా?

Game Changer: గేమ్ ఛేంజర్ రిలీజ్పై కన్ఫ్యూజన్.. మళ్ళీ వాయిదా తప్పదా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). పాన్ ఇండియా లెవల్లో తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. రెండు ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ముందే మొదలైన ఈ సినిమా ఇక రిలీజ్ కు నోచుకోలేదు. 

గత ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. సమ్మర్, దసరా అంటూ వాయిదా పడుతూ వస్తోంది. కనీసం 2024 సంక్రాంతికైనా వస్తుదని ఆశించిన మెగా ఫ్యాన్స్ మరోసారి నిరాశే ఎదురయ్యింది. గేమ్ ఛేంజర్ తరువాత మొదలైన చాలా సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నాయి. కానీ, గేమ్ ఛేంజర్ రిలీజ్ పై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. నిన్నమొన్నటివరకు దసరాకు ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అనే వార్తలు వినిపించాయి. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే.. 2024లో కూడా ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం కనిపించడంలేదు. 

ఇక 2024 సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ కల్కి, ఎన్టీఆర్ దేవర, అల్లు అర్జున్ పుష్ప2 వంటి భారీ సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. కల్కి మే 9న వస్తుండగా, పుష్ప2 ఆగస్ 15 కోసం ఫిక్స్ చేశారు ఇక ఎన్టీఆర్ దేవర అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మధ్యలో చిన్న సినిమాల హవా నడవనుంది. కాబట్టి గేమ్ ఛేంజర్ కి దీపావళి సీజన్ మాత్రమే ఖాలీగా ఉంది. అయితే ఆ టైం వరకు షూటింగ్ కంప్లీట్ అవుతుందా లేదా.. మళ్ళీ వాయిదా వేసి 2025కి తీసుకెళ్తారా అనేది మెగా ఫ్యాన్స్ ను కలవర పెడుతోంది. శంకర్ మీద నమ్మకంతో ఇప్పటికే ఒక సంవత్సరం వెయిట్ చేసిన మెగా ఫ్యాన్స్ ఇక వెయిట్ చేయడం తమవల్ల కాదంటూ ఓపెన్ గానే  కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఇయర్ అయినా గేమ్ ఛేంజర్ సినిమా వస్తుందా లేదా అనేది చూడాలి.