కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లెమ్.. హార్ట్ ఎటాక్‌కు దారి తీయొచ్చు

కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లెమ్.. హార్ట్ ఎటాక్‌కు దారి తీయొచ్చు

ప్రస్తుతం కడుపునొప్పి సమస్య సర్వసాధారణమైపోయింది. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. చాలా మంది కడుపు నొప్పిని చాలా చిన్న సమస్యగా భావిస్తుంటారు. ఇది జీర్ణక్రియ సమస్యగా మాత్రమే అనుకుంటూ ఉంటారు. కొంతకాలం తర్వాత దానంతట అదే పోతుందనుకుంటూ ఉంటారు. ఈ నిర్లక్ష్యపు ఫలితమే దేశంలో 100 మందిలో 99 మంది గ్యాస్ ఎసిడిటీ, అజీర్తితో బాధపడుతున్నట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నారు. అజీర్ణం అనేది సాధారణ రోజువారీ సమస్యగా అనిపించినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద సమస్యలకు, గుండెపోటుకు కూడా దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు ఇది అల్సర్లు, ఐబీఎస్, మధుమేహం, మలబద్ధకం వంటి ప్రమాదకరమైన వ్యాధులుగానూ మారవచ్చని చెబుతున్నారు.

మైనర్ గ్యాస్ ప్రాబ్లెమ్ కూడా ఒక్కోసారి గుండెపోటుకు కారణం కావచ్చు. ఇది మాత్రమే కాదు మలబద్ధకం TB, పేగు క్యాన్సర్‌లకూ దారి తీస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నారు. మీరు ఈ సమస్యలన్నింటినీ నివారించాలనుకుంటే, ఆరోగ్యకరమైన జీవనశైలిని ఫాలో కావడం,  జంక్ ఫుడ్, తీపి లేదా వేయించిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి రోజూ యోగా, ఇతర శారీరక వ్యాయామాలు చేయాలని సలహా ఇస్తున్నారు. 

అతిగా తిన్నప్పుడు లేదా మీరు ఏమి తింటున్నారో పట్టించుకోనప్పుడు ఏమి జరుగుతుందో స్వామి రామ్‌దేవ్ ఇటీవల పంచుకున్నారు. అతిగా తినడం వల్ల గ్యాస్ పెయిన్, అసిడిటీ, అజీర్ణం, కడుపునొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయని ఆయన వెల్లడించారు.  

మన దేశంలో అజీర్ణం పెద్ద సమస్య. దీని వల్ల అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం, లూజ్ మోషన్, పెద్దప్రేగు శోథ, అల్సర్, ఉబ్బరం వంటివి కలిగిస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి స్వామి రామ్‌దేవ్  మీ దినచర్యలో చేర్చుకోగల సులభమైన ఇంటి నివారణలు, జీవనశైలి చిట్కాలను తెలియజేశారు. 

  • ఉదయాన్నే నిద్రలేచి ముందుగా గోరువెచ్చని నీళ్లు తాగాలి. అలా1,-2 లీటర్ల నీటిని ఒకేసారి తాగాలి. నీటిలో రాళ్ల ఉప్పు లేదా నిమ్మరసం కలపండి. నీరు త్రాగిన తర్వాత 5 నిమిషాలు అలా ఉండండి. ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల మీరు మంచి జీవితాన్ని గడపవచ్చు.
  • మీరు మలబద్ధకంతో బాధపడుతున్నట్టయితే బొప్పాయి, ఆపిల్, దానిమ్మ,  పియర్ వంటి పండ్లు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. క్యారెట్, బీట్‌రూట్, జామకాయ, బచ్చలికూర, టమోటాతో చేసిన రసం కూడా కడుపుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.