
లిక్కర్లో చాలా మంది వాటర్ కలుపుకుని తాగుతారు. ఇంకొందరు సోడా వంటివి కలుపుకుంటారు. మరికొందరు శీతల పానీయాలు కలుపుకుని మద్యాన్ని ఆస్వాదిస్తారు. కానీ ఈ తాత స్టైలే వేరు. నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా అంటున్నారు. అందరీలాగా లిక్కర్లో వాటర్, సోడా కలుపుకుని తాగడం కాదు.. ఐస్ క్రీములో మద్యం కలుపుకుని తాగుతూ మనం ఇంతకు మందు చెప్పుకున్న డైలాగ్‌ను ఆయన రిపీట్ చేశారు. అంతేకాదు.. ఐస్‌క్రీమ్ విత్ లిక్కర్ టెస్ట్ చేసిన అనంతరం ఆ రుచికి ఆయన తనను తాను, తన వయస్సును మైమరిచిపోయి డ్యాన్స్ స్టెప్పులతో చిల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ తాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నోన్నో మారియో (80) అనే వృద్ధుడికి ప్రసిద్ధ జర్మన్ హెర్బల్ లిక్కర్ అయిన జాగర్‌మీస్టర్ అంటే ఎంతో ఇష్టం. ఈ లిక్కర్‌ను ఐస్ క్రీమ్‌తో కలుపుకుని తాగడం ఆయన స్పెషల్. తన స్పెషల్ లిక్కర్ రెస్పీని ఇటీవల వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీడియో ప్రకారం.. ఒక గ్లాస్లో ఐస్‌క్రీమ్ వేసి దాంట్లో తనకు ఎంతో ఇష్టమైన జాగర్‌మీస్టర్ లిక్కర్ పోస్తాడు. తర్వాత ఐస్ క్రీమ్‌ను లిక్కర్‌ను బాగా మిక్సింగ్ చేసి తాగేస్తాడు. ఆ రుచికి తనను తాను మైమరిపోయి ఆనందంలో ఉప్పొంగిపోతాడు.
►ALSO READ | కారు సన్‌రూఫ్ నుంచి రొమాన్స్.. హద్దులు మరిచిన జంటకు షాక్ ఇచ్చిన పోలీసులు
లిక్కర్ కిక్కులో తన వయస్సును కూడా లెక్క చేయకుండా 20 ఏళ్ల కుర్రాడిలా స్టె్ప్పులు వేస్తూ చిల్ అవుతాడు. ఈ వీడియోను నోన్నో మారియో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. రోజుల వ్యవధిలోనే లక్షల కొద్ది లైకులు.. వేల కొద్ది కామెంట్లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘మీ టెస్ట్ వేరే లెవల్ తాత అంటూ కొందరు.. చుక్క లోపల పడితే పండు ముసల్లోలైనా చిందులు ఆడాల్సిందే.. దటిజ్ లిక్కర్ పవర్ అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. పెద్దాయన మొఖంలో నిజమైన ఆనందం కనబడుతుందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.