
బెంగుళూరు: సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఇటీవల కొందరు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్‌లో ఉన్నామా.. ప్రైవేట్ ప్లేస్‌లో ఉన్నామా.. అన్న సోయి మరిచి నీచంగా వ్యవహరిస్తున్నారు. నాలుగు గోడల మధ్య జరగాల్సిన వాటిని నడి రోడ్డుపైనే కానిచ్చేస్తున్నారు. ఏకంగా రన్నింగ్ కార్లు, బైకులపై ఎలాంటి సిగ్గు లేకుండా బహిరంగంగా రొమాన్స్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కర్నాటక రాజధాని బెంగుళూరులో వెలుగులోకి వచ్చింది.
కారులో వెళ్తున్న ఓ జంట ఆగలేక.. నడిరోడ్డుపైనే రొమాన్స్ దుకాణం తెరిచింది. కారు లోపల రొమాన్స్ చేస్తే కిక్కేముందనుకున్నారో ఏమో కానీ.. కారు సన్ రూఫ్ ఓపెన్ చేసి బహిరంగా ముద్దుల్లో ముగినిపోయారు. పబ్లిక్ ప్లేస్.. చుట్టు జనాలు ఉన్నారన్న విషయం మర్చిపోయి రొమాన్స్ చేస్తోన్న ఈ జంట బాగోతాన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2025, మే 27 రాత్రి బెంగుళూరు సిటీలోని ట్రినిటీ రోడ్డులో వెళ్తోన్న ఓ రన్నింగ్ కారులో ఒక జంట రొమాన్స్ చేసింది. కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి ఇద్దరు ముద్దుల్లో మునిగిపోయారు. పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నామన్నా కామన్ సెన్స్ లేకుండా వికృతచేష్టలకు పాల్పడ్డారు. వీరి బరితెగింపును కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కర్ణాటక పోర్ట్‌ఫోలియో అనే ఎక్స్ హ్యాండిల్ ఈ క్లిప్‌ను షేర్ చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను ట్యాగ్ చేశారు.
►ALSO READ | ఖడ్గ మృగానికి కోపమొస్తే ఇలాగే ఉంటది: టూరిస్టులకు చుక్కలు చూపించిన రైనో
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోను సీరియస్‌గా తీసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. కారు రిజస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా యజమానిని గుర్తించి రూ.1,500 జరిమానా విధించి నడి రోడ్డుపై బరి తెగించిన జంటకు పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు రూ.1,000, సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనలకు అదనంగా రూ.500 ఫైన్ వేశారు. నడి రోడ్డుపై ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.