భూభారతి రీ సర్వేపై ఎర్రవల్లి గ్రామస్తుల అభ్యంతరం.. అర్ధాంతరంగా ముగిసిన గ్రామసభ

భూభారతి రీ సర్వేపై ఎర్రవల్లి గ్రామస్తుల అభ్యంతరం.. అర్ధాంతరంగా ముగిసిన గ్రామసభ

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో భూభారతి రీ సర్వేపై ఎర్రవల్లి గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రీ సర్వే అంశంపై 2026 అక్టోబర్ 22న నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తులు ఆందోళన వ్యర్తం చేశారు. దీంతో  అర్ధాంతరంగా ముగిసింది.

రెండు గ్రామాల మధ్య శివారు సమస్య పరిష్కరించాకే రీ సర్వే చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.  సర్వే నంబర్ 325లో కాస్తుదారులకు పట్టాలు ఇచ్చాకే రీ సర్వే చేయాలని కోరారు.  

 ఇప్పటికే  ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 325 పరిధిలోని 388 ఎకరాల ప్రభుత్వ భూమి, అలాగే వెలికట్ట గ్రామంలోని సర్వే నంబర్ 271 లో సర్వే నిర్వహించారు. ఎర్రవల్లిలో 8 రోజుల పాటు, వెలికట్టలో 5 రోజుల పాటు ఈ  -సర్వే కొనసాగింది.  సర్వే నంబర్ 325 సరిహద్దులను అధికారులు గుర్తించి, రికార్డుల ప్రకారం సంబంధిత వ్యక్తులకు  రైతులకు నోటీసులు జారీ చేశారు. 

ALSO READ : పదో తరగతి పరీక్షల ఫీజుల షెడ్యూల్ విడుదల.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

అయితే రీసర్వే చేయాలన్న ప్రతిపాదనను గ్రామస్తులు వ్యతిరేకించారు.  ఎర్రవల్లి, వెలికట్ట గ్రామాల శివారు సమస్య పరిష్కరించాకే రీసర్వే చేయాలని డిమాండ్ చేయడంతో గ్రామసభ ముగిసింది.