జ్వరం, జలుబు, గొంతునొప్పా ? ఇంట్లోనే కషాయంతో ఇలా చెక్ పెట్టండి!

జ్వరం, జలుబు, గొంతునొప్పా ? ఇంట్లోనే కషాయంతో ఇలా చెక్ పెట్టండి!

జ్వరం, గొంతునొప్పి, దగ్గు చల్లగా ఉండే ఈ కాలంలో సాధారణంగా వచ్చేవే. జ్వరం వస్తే ఎంత టెంపరేచర్ ఉంది, ఎన్ని రోజులు ఉందో అనేవి గమనించుకోవాలి. రెండు, మూడు రోజులపాటు జ్వరం ఉంటే డాక్టర్లను కలవాలి. అయితే ఈ రెండు మూడు రోజులూ ఉపశమనం

కోసం, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఆయుష్ డిపార్ట్మెంట్ కొన్ని రెమెడీస్ (ఆయుర్వేద పద్ధతులను) అనుసరిస్తూ ఇంట్లోనే ఉంటే మంచిదని చెబుతోంది. ఔషధ గుణాలు కలిగిన కషాయాలను ఇంట్లోనే తయారు చేసుకుని తాగితే ఒంట్లో ఉన్న సమస్య పోవడమే కాదు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అలా ఈ సీజన్లో వచ్చే సర్దికి ఉపశమనం కలిగిస్తూ బాడీలో ఇంప్రూవ్మెంట్ కి బూస్ట్ ఇచ్చే తులసి, నల్లమిరియాల కషాయం తాగితే మేలని ఆయుష్ చెబుతుంది. 

కావాల్సినవి:
తులసి ఆకులు - 5 లేదా 6 
యాలకుల పొడి - అర టీ స్పూన్ 
నల్ల మిరియాలు - 10
 శొంఠి - తగినంత
దాల్చిన చెక్క - తగినంత 
ఎండుద్రాక్ష - తగినంత 

తయారీ: బాణలిలో రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. ఇప్పుడు తులసి, యాలకుల పొడి, నల్ల మిరియాలు, అల్లం ఎండు ద్రాక్షలను ఆ నీళ్లలో వేయాలి. వీటన్నింటిని 15 నిమిషాలు వేడి చేయాలి. చల్లారాక వడపోసి కషాయం తీయాలి. రుచి కోసం తగినంత బెల్లం, అర చెక్క నిమ్మరసం కలుపుకోవాలి.

యోజనాప్రలు: ఈ కషాయాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుతుంది. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా తీసుకోవచ్చు. ఫ్లూ, జలుబు వస్తే తప్పకుండా ఈ కషాయం తీసుకోవాలి. ఇది గొంతుకు రిలీఫ్ ఇస్తుంది.

ALSO READ : బాలికలకు రుతుస్రావ సెలవులపై భిన్నాభిప్రాయాలు

నల్ల మిరియాలు గొంతులోని కఫం తొలగిస్తాయి. తులసి, అల్లం, యాలకుల ఇన్ ఫెక్షన్ వల్ల ఉన్న సమస్యలను పోగొడతాయి. తులసిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శ్వాసనాళంలో ఉన్న ఇన్ఫెఫెక్షన్ ని పోగొడుతుంది. ఈ కషాయం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

గోల్డెన్ మిల్క్ 
పసుపు 'నేచురల్ యాంటీబయాటిక్'. నొప్పులు, వాపులు, అలర్జీలను తగ్గిస్తుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు వచ్చినప్పుడు గోరువెచ్చని (150 మిల్లీ లీటర్ల) పాలలో ఒక టేబుల్ స్పూన్ (చిటికెడంత) పసుపు కలిపి తాగితే గొంతు వాపు, నొప్పి తగ్గుతాయి. కనీసం రోజుకు ఒక గ్లాస్ తాగాలి.

మార్నింగ్ బూస్ట్ 
కషాయం తాగుతూనే ఉదయం ఒక టీ స్పూన్ చవన్ స్ (10 గ్రాములు) తీసుకోవాలి. డయాబెటిస్ ఉంటే షుగర్ ఫ్రీ చవన్స్ తీసుకోవాలి.