ఫిఫా ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్.. ఇండియాలో లైవ్ ఎక్కడ చూడొచ్చంటే..?

ఫిఫా ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్.. ఇండియాలో లైవ్ ఎక్కడ చూడొచ్చంటే..?

FIFA World Cup: ఫుట్‌బాల్ లవర్స్‌కు పూనకాలు తెప్పించే రోజులు దగ్గరపడ్డాయి. క్రీడా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026) మెగా టోర్నీకి కౌంట్‌డౌన్ షురూ అయింది. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి సరికొత్త రికార్డులు, ట్రెండింగ్ ఫార్మాట్‌తో ఈ లీగ్ అభిమానుల ముందుకు రాబోతోంది. ఈసారి మెగా ఈవెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు మరియు భారత కాలమానం (IST) ప్రకారం లైవ్ టైమింగ్స్ మీకోసం. 

హిస్టరీలోనే ఫస్ట్ టైమ్: 
ఫిఫా చరిత్రలోనే మొదటిసారి అమెరికా (USA), కెనడా, మెక్సికో.. మూడు దేశాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి హోస్టింగ్ ఇస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం 32 జట్లు మాత్రమే తలపడేవి.. కానీ ఈసారి ఫార్మాట్‌ను పూర్తిగా మార్చేస్తూ ఏకంగా 48 జట్లకు ఛాన్స్ ఇచ్చారు. దాంతో చిన్న దేశాలు కూడా ఈసారి వరల్డ్ కప్‌లో అరంగేట్రం చేయబోతున్నాయి. 16 నగరాల్లో.. 12 గ్రూపులుగా విడిపోయి.. మొత్తం 104 మ్యాచ్‌లతో ఈ ఫుట్‌బాల్ టోర్నీ జరగనుంది.

నాకౌట్ స్టేజ్ షెడ్యూల్: 
* రౌండ్ ఆఫ్ 32: జూన్ 28 నుంచి జూలై 3 వరకు (అర్ధరాత్రి 12:30, 3:30, తెల్లవారుజామున 6:30 గంటలకు)
* రౌండ్ ఆఫ్ 16: జూలై 4 నుంచి జూలై 8 వరకు
* క్వార్టర్ ఫైనల్స్: జూలై 9 నుంచి జూలై 12 వరకు (అర్ధరాత్రి 12:30, 3:30 గంటలకు)
* సెమీఫైనల్ 1: జూలై 15, తెల్లవారుజామున 1:30 గంటలకు (టెక్సాస్)
* సెమీఫైనల్ 2: జూలై 16, తెల్లవారుజామున 1:30 గంటలకు (అట్లాంటా)
* రన్నరప్ (3వ స్థానం) మ్యాచ్: జూలై 19, తెల్లవారుజామున 1:30 గంటలకు (మియామి)
* ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్: జూలై 20, అర్ధరాత్రి 12:30 గంటలకు (న్యూయార్క్/న్యూజెర్సీ)
 
ఇండియాలో లైవ్ ఎక్కడ చూడొచ్చంటే?: 
భారత్‌లో ఈ మెగా ఈవెంట్ అధికారిక బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, Sports18 ఛానల్‌, JioCinema యాప్‌లో డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగుతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో కామెంటరీ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

►ALSO READ | Riyan Parag: అభిమానిని పక్కకు తోసేసిన రియాన్ పరాగ్.. నెట్టింట విమర్శల పర్వం!

ఓపెనింగ్ సెర్మనీ రచ్చ: 
మెక్సికో సిటీలో జరిగే గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీలో పాప్ క్వీన్ షకీరా, బాడ్ బన్నీ, డ్రేక్ వంటి ఇంటర్నేషనల్ స్టార్లు పర్ఫామ్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా ఈసారి టోర్నీలో దిగ్గజాలైన అర్జెంటీనా, బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్ జట్లు హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. గ్లోబల్ ఐకాన్స్ లియోనెల్ మెస్సీ, కిలియన్ ఎంబాప్పే, ఎర్లింగ్ హాలాండ్ ప్రదర్శనలపై సోషల్ మీడియాలో అప్పుడే భారీ హైప్ క్రియేట్ అయింది.