Riyan Parag: అభిమానిని పక్కకు తోసేసిన రియాన్ పరాగ్.. నెట్టింట విమర్శల పర్వం!

Riyan Parag: అభిమానిని పక్కకు తోసేసిన రియాన్ పరాగ్.. నెట్టింట విమర్శల పర్వం!

Riyan Parag: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మరోసారి వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు. ఒక యంగ్ ఫ్యాన్ పట్ల ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే?: 
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రియాన్ పరాగ్ భారీ సెక్యూరిటీ మధ్య నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక చిన్నపిల్లాడు ఫోటో (సెల్ఫీ) కోసం సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని అతడి ముందుకు వచ్చాడు. గుంపులో తనతో పాటే నడుస్తున్న ఆ పిల్లాడిని చూసి పరాగ్ మొదట “సైడ్ హో జా” (పక్కకు తప్పుకో) అన్నాడు. అయినప్పటికీ ఆ పిల్లాడు పక్కకు తప్పుకోకపోవడంతో, పరాగ్ అతడిని రెండు చేతులతో పైకి లేపి, పక్కకు పెట్టి తన దారిన తాను ముందుకు వెళ్లిపోయాడు. 

నెటిజన్ల తీవ్ర అసంతృప్తి: 
ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. మెజారిటీ నెటిజన్లు రియాన్ పరాగ్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబడుతున్నారు. సమాజంలో రోల్ మోడల్‌గా ఉండాల్సిన ఒక అంతర్జాతీయ క్రికెటర్, చిన్న పిల్లవాడి పట్ల అంతకంటే కాస్త సున్నితంగా వ్యవహరించి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. పిల్లాడిని అలా పక్కకు నెట్టేయడం కరెక్ట్ కాదని, కనీసం ఒక్క సెల్ఫీ ఇచ్చినా ఆ పిల్లాడు ఎంతో సంతోషపడేవాడని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

►ALSO READ | CSK vs SRH మధ్య టఫ్ ఫైట్.. ఈరోజు గెలిచేది పక్కా ఆ జట్టే!

వివాదాలకు కేరాఫ్ అడ్రస్!: 
రియాన్ పరాగ్‌కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. మైదానంలో మితిమీరిన అగ్రెషన్, ఆఫ్-ఫీల్డ్ ప్రవర్తనతో తరచూ ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ లోనే కొద్దిరోజుల క్రితం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ జరిగినప్పుడూ, డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని ఆయన ఈ-సిగరెట్ (Vaping) తాగుతూ లైవ్ కెమెరాలకు చిక్కారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపగా.. బీసీసీఐ దీనిపై విచారణ జరిపి అతడికి భారీ జరిమానా కూడా విధించింది.