CSK vs SRH: ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో ప్లేఆఫ్స్ రేసు అత్యంత ఆసక్తికరంగా మారింది. కాసేపట్లో (మే 18న, 2026) చెన్నైలోని ప్రముఖ ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నైకి ఇది 'డూ ఆర్ డై' (ఖచ్చితంగా గెలవాల్సిన) మ్యాచ్ కాగా, ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు టాప్-3లో తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని చూస్తోంది.
పిచ్ రిపోర్ట్:
సాంప్రదాయకంగా చెపాక్ పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. మిడిల్ ఓవర్లలో బంతి ఇక్కడ బాగా టర్న్ అవుతుంది. ఈ పిచ్‌పై మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 183, -186 పరుగులుగా ఉంది, అంటే మొదట్లో ఇది బ్యాటింగ్‌కు కూడా బాగానే సహకరిస్తుంది. రాత్రి 12వ ఓవర్ తర్వాత మైదానంలో మంచు ప్రభావం (Dew Factor) చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల బంతి తడిసిపోయి బౌలింగ్ చేయడం (ముఖ్యంగా స్పిన్నర్లకు) కష్టమవుతుంది. కాబట్టి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే జట్టుకు భారీ అడ్వాంటేజ్ ఉంటుంది.
►ALSO READ | ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ సస్పెన్స్.. షాక్లో CSK ఫ్యాన్స్
ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారంటే?:
ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 10 పరుగుల తేడాతో చెన్నైని ఓడించినప్పటికీ, ఇవాళ్టి మ్యాచ్ సమీకరణాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. చెపాక్ స్టేడియంలో హైదరాబాద్‌పై చెన్నైకి తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ జరిగిన గత 6 మ్యాచ్‌ల్లో చెన్నై 5 సార్లు విజయం సాధించింది. కాబట్టి, ఈ మ్యాచులో చెన్నై గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సంజు శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్‌లో ఉండటం చెన్నైకి పెద్ద ప్లస్ పాయింట్. వీటన్నింటికీ తోడు, ఇది ఎంఎస్ ధోనీకి చివరి హోమ్ మ్యాచ్ కావచ్చనే ఎమోషనల్ సెంటిమెంట్ చెన్నై జట్టులో గెలుపు కసిని మరింత పెంచనుంది.
