Dhoni Retirement: నేడు క్రికెట్ ప్రపంచం మొత్తం చెన్నై వైపు చూస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఎక్కడ చూసినా 'తలా' ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవిష్యత్తు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అలాగే ఈరోజు రాత్రికి ఆయన రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని డిస్కషన్ నడుస్తుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగబోయే మ్యాచ్ ధోనీకి హోమ్ గ్రౌండ్‌లో చివరి మ్యాచ్ కానుందనే వార్తలు అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. దీంతో చెపాక్ స్టేడియానికి పలువురు మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు తరలివస్తుండటంతో.. ఈ రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ తన అధికారిక రిటైర్మెంట్ ప్రకటన చేసే ఛాన్స్ ఉందంటూ వస్తున్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
ధోనీ రిటైర్మెంట్?:
తాజాగా వైరల్ అవుతున్న కొన్ని నివేదికల ప్రకారం.. గాయం కారణంగా ధోనీ ఈ మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో ఆడకపోయినా, ప్రశాంత్ వీర్ స్థానంలో 'ఇంపాక్ట్ ప్లేయర్' గా బరిలోకి దిగే అవకాశం ఉందంటూ ప్రచారం కొనసాగుతోంది. సీఎస్‌కే ఫ్రాంచైజీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ రాత్రి మ్యాచ్ అనంతరం జరిగే 'ల్యాప్ ఆఫ్ ఆనర్' (మైదానం చుట్టూ తిరుగుతూ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమం) సమయంలో ధోనీ వీడ్కోలు పలికే అవకాశం ఉందనే వార్తలతో ఎల్లో ఆర్మీ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
►ALSO READ | ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. CSK Vs SRH మ్యాచ్ కూడా ఆడని కెప్టెన్ కూల్
CSK ప్లేఆఫ్స్ అవకాశాలు:
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జరగబోయే ఈ పోరు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి అత్యంత కీలకం. టైటిల్ రేసులో నిలవాలన్నా, పాయింట్ల పట్టికలో టాప్-4లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్నా సీఎస్‌కే ఈరోజు భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచులో సాధించే పెద్ద విజయం వారి నెట్ రన్ రేట్‌ను మెరుగుపరచడమే కాకుండా, ప్లేఆఫ్స్ రేసులో ఉన్న మిగతా జట్లకు గట్టి పోటీని ఇస్తుంది. ఒకవేళ ధోనీకి ఇదే చివరి హోమ్ మ్యాచ్ అయితే, ఆయన గౌరవార్థం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని రుతురాజ్ గైక్వాడ్ సేన మరింత కసితో మైదానంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది.
హైదరాబాద్ టఫ్ ఫైట్:
రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని చెన్నై జట్టుకు హోమ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ, ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టడం అంత సులువు కాదు. సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైన్-అప్ ఈ సీజన్‌లో పరుగుల విధ్వంసం సృష్టిస్తోంది. దానికి తోడు వారి పేస్ బౌలింగ్ కూడా బలంగా తయారైంది. మరోవైపు హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో గెలిచి తమ ప్లేఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకోవాలని చూస్తోంది.
🚨 BIG UPDATE ON CSK 🚨
— lndian Sports Netwrk (@IS_Netwrk29) May 18, 2026
- Today, there are going to be two changes in the Chennai Super Kings playing XI.
- Akela Hossain has been picked in the playing XI again today.
- Today, MS Dhoni is going to play his last match at Chepauk. And according to sources, he will play as an… pic.twitter.com/SL7R9W9b2D
