హైదరాబాద్లో మరో అగ్నిప్రమాదం... కాటన్ గోదాంలో మంటలు

హైదరాబాద్లో మరో అగ్నిప్రమాదం...   కాటన్ గోదాంలో మంటలు

హైదరాబాద్‌లో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యాకత్‌పురాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెయిన్ బజార్ పోలీస్  స్టేషన్ పరిధిలోని ఓ  కాటన్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది.

స్థానికులు  వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.  సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు.  ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సుమారుగా రూ. 5 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. 

ALSO READ: పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై ఢీకొని.. పల్టీలు కొట్టిన కార్లు

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు