యూట్యూబ్‌లో తన అదిరిపోయే స్టెప్పులతో మిలియన్ల కొద్దీ వ్యూస్ కొల్లగొట్టింది తెలంగాణ జానపద సంచలనం, ఫోక్ డాన్సర్ నాగదుర్గ. 'కాపోళ్ల ఇంటికాడా', 'పేరుగల్ల పెద్దిరెడ్డి', 'దారి పొంటొతుండు', 'తిన్న తీరం పడుతా లే' వంటి వైరల్ సాంగ్స్‌తో సోషల్ మీడియాను ఊపేసింది. ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్‌లో ఏకంగా బంపర్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ నయా తార, ఇప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా మెరవడానికి సిద్ధమైంది.
ప్రియదర్శి సరసన..
అగ్ర దర్శకుడు సుకుమార్‌కు చెందిన 'సుకుమార్ రైటింగ్స్', సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ నేతృత్వంలోని బన్నీ వాస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నాయి. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పక్కా లోకల్ ఎంటర్‌టైనర్‌లో లీడ్ రోల్ కోసం మేకర్స్ నాగదుర్గను ఎంపిక చేశారు. వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి ఈ సినిమాలో హీరో. వంశీ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
లక్కీ స్టార్..
నాగదుర్గకు కేవలం ఇదొక్కటే కాదు, వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఆమె లీడ్ రోల్‌లో నటించిన ‘కలివి వనం’ (కలివాణం) అనే విలక్షణమైన సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులోనే కాదు, కోలీవుడ్‌లోనూ నాగదుర్గ క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుంది. స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రంలో ఈమెనే హీరోయిన్‌గా ఎంపిక చేశారు . ఈ మూవీకి లవ్ ఓ లవ్ టైటిల్ ను ఖరారు చేశారు. లేటెస్ట్ ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు., రొమాన్స్, కామెడీతో తెరకెక్కించిన ఈ సినిమాలో సెల్వ రాఘవన్, కేఎస్. రవికుమార్, వనిత, రమ్య, ఆదిత్య, కదిర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
►ALSO READ | 'కాక్‌టైల్ 2' రివ్యూ: క్రేజీ లవ్ ట్రయాంగిల్.. రష్మిక యాసపై ట్రోల్స్.. సినిమా ఎలా ఉందంటే?
మట్టిలోని మాణిక్యమైన నాగదుర్గ సహజ సిద్ధమైన నటన, పల్లెటూరి హావభావాలు, ఎనర్జిటిక్ డాన్స్ ఈ సినిమాలకు ప్రధాన బలం కానున్నాయి. యూట్యూబ్ స్టార్ నుండి టాలీవుడ్ హీరోయిన్‌గా ఎదుగుతున్న ఈ తెలంగాణ ముద్దుబిడ్డ లక్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్, మిగిలిన నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
