ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు..సీఎంసీలో వాక్ ఫ్రీ కార్యక్రమం

ఫుట్ పాత్  ఆక్రమణల తొలగింపు..సీఎంసీలో వాక్ ఫ్రీ కార్యక్రమం

హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీలో అధికారులు శనివారం వాక్ ఫ్రీ కార్యక్రమంలో భాగంగా ఫుట్ పాత్ లపై ఆక్రమణలను తొలగించారు. 3 జోన్ల పరిధిలో ని 16 ప్రాంతాల్లో 16.7 కిలోమీటర్ల మేర తనిఖీలు నిర్వహించి, 420 ఫుట్‌‌‌‌పాత్ ఆక్రమణలను కూల్చేశారు. 

కుత్బుల్లాపూర్ జోన్‌‌‌‌లో  8 ప్రాంతాల్లో 8.2 కిలోమీటర్ల మేర 197, కూకట్‌‌‌‌పల్లి జోన్‌‌‌‌లో మాదాపూర్, ఆల్విన్ కాలనీ, కూకట్‌‌‌‌పల్లి సర్కిళ్లలో 1.5 కిలోమీటర్ల మేర తనిఖీలు నిర్వహించి 67, శేరిలింగంపల్లి జోన్‌‌‌‌లో నార్సింగి, పటాన్‌‌‌‌చెరు, అమీన్‌‌‌‌పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో 7 కిలోమీటర్ల మేర ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, 156 ఆక్రమణలను  తొలగించారు.