ODI World Cup 2023:  ప్రపంచ కప్ ఫైనల్‍ చేరే రెండు జట్లు ఏవి..? 12 మంది మాజీ క్రికెటర్ల ప్రిడిక్షన్ 

ODI World Cup 2023:  ప్రపంచ కప్ ఫైనల్‍ చేరే రెండు జట్లు ఏవి..? 12 మంది మాజీ క్రికెటర్ల ప్రిడిక్షన్ 

దేశంలో వరల్డ్ కప్ సందడి మొదలైంది. ఈ మెగా టోర్నీ మొదలవ్వడానికి ఇక గంటల సమయం మాత్రమే మిగిలివుంది. 10 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానుండగా, తొలి మ్యాచ్‍ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ తరుణంలో ప్రపంచ కప్ పాల్గొనే జట్ల బలాబలాల గురుంచి..? ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? అనే విషయాలపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

ప్రపంచ కప్ ఫైనల్‍ చేరే రెండు జట్లను అంచనా వేసిన 12 మందిలో 11 మంది భారత జట్టు ఫైనల్ చేరుతుందని అంచనా వేయగా. ఒక్క ఆరోన్ ఫించ్ మాత్రమే భారత్ ఫైనల్ కూడా చేరదని అంచనా వేశాడు. వీరిలో నలుగురు ఇండియా, ఇంగ్లాండ్ ఫైనల్ చేరతాయని అభిప్రాయపడగా.. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఫైనల్ పోరు ఉంటుందని ముగ్గురు అంచనా వేశారు.

12 మంది మాజీ క్రికెటర్ల వరల్డ్ కప్ ఫైనల్ ప్రిడిక్షన్ 

  • క్రిస్ గేల్: ఇండియా, పాకిస్తాన్
  • దినేశ్ కార్తీక్: ఇండియా, పాకిస్తాన్
  • ముత్తయ్య మురళీధరన్: ఇండియా, పాకిస్తాన్
  • జాక్వెస్ కలిస్: ఇండియా, ఇంగ్లాండ్
  • వకార్ యూనిస్: ఇండియా, ఇంగ్లాండ్
  • డేల్ స్టెయిన్: ఇండియా, ఇంగ్లాండ్
  • పీయూష్ చావ్లా: ఇండియా, ఇంగ్లాండ్ 
  • షేన్ వాట్సన్: ఇండియా, ఆస్ట్రేలియా
  • సంజయ్ మంజ్రేకర్: ఇండియా, ఆస్ట్రేలియా

ALSO READ : శ్రీదేవిది సహజ మరణం కాదు..నాకు లై డిటెక్టర్‌ పరీక్షలు చేశారు.. బోనీకపూర్ సంచలన వ్యాఖ్యలు

  • ఫాఫ్ డుప్లెసిస్: ఇండియా, ఆస్ట్రేలియా/న్యూజిలాండ్
  • ఇర్ఫాన్ పఠాన్: ఇండియా vs దక్షిణాఫ్రికా
  • ఆరోన్ ఫించ్: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా