V6 News

Video Viral: పెద్దాయనకు దసరా పండుగ అంటే ఇదేనేమో... లోకల్ ట్రైన్ లో వీళ్ల డ్యాన్స్ అదిరింది

 Video Viral: పెద్దాయనకు దసరా పండుగ అంటే ఇదేనేమో...  లోకల్ ట్రైన్ లో వీళ్ల  డ్యాన్స్ అదిరింది

లోకల్ ట్రైన్ అనగానే ఎప్పుడూ కొట్లాటలు గుర్తుకొస్తాయి.  కాని ఈ సారి మాత్రం ముంబయిలో లోకల్ ట్రైన్ సందడిగా మారింది.  ఎప్పుడు చొక్కాలు పట్టుకొనే ఘటనలు జరిగేవి.. కాని ఇప్పుడు దసరా పండుగ సమయంలో జనాలు చేయి చేయి కలిపి గర్బా డ్యాన్స్ అదరహో అనిపించారు. 

నవరాత్రుల వేళ ముంబయి లోకల్ ట్రైన్ మాత్రం సందడిగా మారిపోయింది. ఓ వైపు నవరాత్రుల వేడుకలు జరుగుతుంటే ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణికులు గర్బా డాన్స్ చేయడం వైరల్‌గా మారింది.

ముంబయిలో ప్రయాణికులు తమ రోజువారి ప్రయాణాన్ని సందడిగా మార్చుకున్నారు. నవరాత్రుల వేళ ప్రయాణికులు గర్బా డ్యాన్స్‌కి స్టెప్పులు వేసారు. వీరి డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో పాటు నెటిజన్ల మనసు దోచుకుంది. ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటే ముంబయి సిటీలో నవరాత్రి వేళ ప్రయాణికులు తమ ఆనందాన్ని ఇలా పంచుకునేందుకు ప్రయత్నించారు.

Also Read : మెగాస్టార్ మంచి మనసు.. బాల్య స్నేహితుడికి చికిత్స

యువకుల నుండి వృద్ధుల వరకు ట్రైన్‌లో గర్బా డ్యాన్స్ చేసారు. కొందరు వారిని ఉత్సాహ పరిచారు. @mumbaiheritage అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో నెటిజన్ల ప్రశంసలు పొందింది. ముంబయి లోకల్ ట్రైన్‌లో గర్బా .. వావ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. తమకి కూడా ఈ డ్యాన్స్‌లో పాల్గొనాలనిపించింది అని మెసేజ్ చేసారు.