మెగాస్టార్ మంచి మనసు.. బాల్య స్నేహితుడికి చికిత్స

మెగాస్టార్ మంచి మనసు.. బాల్య స్నేహితుడికి చికిత్స

సినిమాల్లో చిరంజీవి ఎంతటి స్టారో ఎదుటివారికి సాయం చేయడంలోనూ అంతేస్థాయి వ్యక్తి.  చాలా మందికి తనవంతు సాయం చేసిన చిరు..   ఇప్పుడు తన బాల్య స్నేహితుడికి మరిచిపోలేని సాయం చేశారు.  చిరంజీవి బాల్యమంతా మొగల్తూరులోనే జరిగిందన్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు చాలామంది స్నేహితులు ఉన్నారు. అందులో పువ్వాడ రాజా ఒకరు. 

పువ్వాడ రాజా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా  తెలుసుకున్న చిరంజీవి.. అతడిని హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు.  అంతేకాకుండా స్వయంగా ఆసుపత్రికి వెళ్లి... డాక్టర్‌తో మాట్లాడి స్నేహితుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఉజ్వల్ రెడ్డి అనే వ్యక్తి ఈ వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Also Read : అసలు ఖాళీగా లేను..ఆయన పిలిస్తే మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తా : అనుపమ పరమేశ్వరన్

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే..  ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా వచ్చి సక్సెస్ అందుకున్నారు చిరు. ఇక  ఆగస్టులో భోళా శంకర్ గా ఘోరమైన డిజాస్టర్ చవిచూశారు. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ డిసెంబర్ లో స్టార్ట్ కానుంది.