అసలు ఖాళీగా లేను..ఆయన పిలిస్తే మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తా : అనుపమ పరమేశ్వరన్

అసలు ఖాళీగా లేను..ఆయన పిలిస్తే మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తా : అనుపమ పరమేశ్వరన్

బడా హీరోయిన్లంతా వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ మధ్యే త్రిష, నయనతార, అనుష్క వంటి హీరోయిన్స్  నటించిన సినిమాలు హిట్ అవ్వడంతో.. సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. అంతేకాకుండా.. ఫామ్ కోల్పోయిన యంగ్ హీరోయిన్స్ కూడా ఎక్కడా ఖాళీ లేమంటూ..తమదైన మూవీస్ తో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఒకవేళ సినిమా అవకాశాలు ఎక్కువ లేకున్న..ఇన్స్టా వంటి సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తూ బిజీగా ఉన్నారు. లేటెస్ట్ గా హీరోయిన్  అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) ఓ వస్త్ర దుకాణం మొదటి వార్షికోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా అటెండ్ అయింది.  అనంతరం మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకుంది.

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనదైన యాక్టింగ్ తో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. చాలా రోజుల నుంచి ఈ బ్యూటీకి సరైన అవకాశాలు రాకపోవడంతో..పనై అయిపోందంటూ వినిపిస్తోన్న కామెంట్స్ పై రియాక్ట్ అయింది.

'నా సినిమా కెరీర్ చాలా బాగుంది. అస్సలు గ్యాప్ లేకుండా..రోజు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నానని తెలిపింది. అలాగే 365 రోజులు నిత్యం ఏదో మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న అంటూ..ఎప్పుడు సినిమా అవకాశాల వేటలో వెనకబడలేదని వెల్లడించింది.  ప్రస్తుతం నా నుంచి 9 సినిమాలు రాబోతున్నాయి..కాకపోతే ఈ టైములో అవేంటనేవి చెప్పలేను. త్వరలోనే నేను రవితేజతో నటిస్తున్న ఈగిల్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉందంటూ వెల్లడించింది. అలాగే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటించాలనే కోరిక ఉందని..ఏ క్షణం నుంచైనా రాజమౌళి నుంచి పిలుపొస్తే మాత్రం పరుగెత్తుకుంటూ వెళ్లిపోతానని' చెబుతోంది.

అనుపమ పరమేశ్వరన్ తెలుగులో చివరగా నటించిన మూవీ బట్టర్ ఫ్లై. త్వరలో డీజే సిద్దుతో టిల్లూ స్క్వేర్ లో నటిస్తుంది. ఈ మూవీలో తన క్యారెక్టర్ కు అందరు ఫిదా అవ్వాల్సిందే అంటూ ఆసక్తి రేపింది. ఈ సినిమాలే కాకుండా మలయాళం, తమిళ్ అనుపమ మూవీస్ చేయనుంది. 

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న హీరోయిన్ శ్రీలీల. ఇక ఈ బ్యూటీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది. దాదాపు 10 మూవీస్ లో నటిస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది.నవంబర్‌లో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ మూవీ రిలీజ్ అవుతుండగా..జనవరిలో మహేష్ బాబు గుంటూరు కారం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా దాదాపు 10 చిత్రాల తర్వాత..ప్రభాస్ తో మరో భారీ చిత్రానికి సైన్ చేసింది.