ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ బ్రిలియంట్ క్యారెక్టర్స్ అనగానే గుర్తొచ్చే పేరు 'జార్జ్‌కుట్టి'. తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఎంతటి క్రైమ్ అయినా చేయగల ఆ ఫ్యామిలీ మ్యాన్, మళ్ళీ మన ముందుకు వచ్చేస్తున్నాడు. కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్, మ్యాజిక్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వస్తున్న మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ 'దృశ్యం 3'. మే 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా, అప్పుడే రికార్డుల సునామీ సృష్టిస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు..
లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇందులో ఇండియా నుంచే ఏకంగా రూ.10.50 కోట్ల బుకింగ్స్ జరిగాయి. కేరళలో ఐతే జార్జ్‌కుట్టిని స్క్రీన్‌పై చూడటానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. కేరళలోనే అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 6.75 కోట్లకు చేరగా, స్పాట్ బుకింగ్స్‌తో ఈ నంబర్ మరింత ఊహించని రేంజ్‌కు వెళ్లడం ఖాయం అని అంచనా వేస్తున్నారు.. గల్ఫ్ కంట్రీస్, నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లో కూడా మలయాళ సినిమా పవర్ ఏంటో చూపిస్తూ ఓవర్సీస్ బుకింగ్స్ దుమ్మురేపుతున్నాయి. మొదటి షో పడేసరికి వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 27-30 కోట్లకు చేరే అవకాశం ఉంది.
#Drishyam3 crosses ₹25Cr in advance bookings 👀🔥
— Balaji (@RDBalaji) May 20, 2026
Georgekutty effect is REAL 💥 pic.twitter.com/XAzuUJKRTX
కథలో మరింత ట్విస్ట్..
'దృశ్యం' మొదటి పార్ట్ ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసి ఎన్నో భాషల్లో రీమేక్ కాగా, సెకండ్ పార్ట్ ఓటీటీలో వచ్చి సంచలనం సృష్టించింది. ఇక ఈ మూడో భాగం.. 'దృశ్యం 2' ముగిసిన నాలుగున్నరేళ్ల తర్వాత జార్జ్‌కుట్టి జీవితంలో జరిగిన సంఘటనల చుట్టూ తిరగనుంది. ఈసారి పోలీస్ ఇన్వెస్టిగేషన్ మరింత పీక్స్‌లో ఉండబోతోందని, జార్జ్‌కుట్టి మైండ్ గేమ్‌కు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.
►ALSO READ | PEDDI Censor: U/A సర్టిఫికేట్‌తో ‘పెద్ది’ రిలీజ్‌కు రెడీ.. 12 ఏళ్లు దాటనోళ్లు మూవీ చూడొచ్చా!
ఈసారి జార్జ్‌కుట్టి శవాన్ని ఎక్కడ దాచాడు? పోలీసులకు దొరుకుతాడా.. లేక మళ్లీ బురిడీ కొట్టిస్తాడా? అని సినిమా లవర్స్ తెగు అడుగుతున్నారు. మోహన్‌లాల్ రీసెంట్ మూవీ 'ఎంపురాన్' రూ.70 కోట్ల గ్లోబల్ ఓపెనింగ్స్‌తో మలయాళంలో హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు 'దృశ్యం 3' ఆ రికార్డులను సైతం సవాల్ చేసేలా కనిపిస్తోంది. మరి థియేటర్లలో ఈ ఈ సస్పెన్స్ కింగ్ ఆట ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
