PEDDI Censor: U/A సర్టిఫికేట్‌తో ‘పెద్ది’ రిలీజ్‌కు రెడీ.. 12 ఏళ్లు దాటనోళ్లు మూవీ చూడొచ్చా!

PEDDI Censor:  U/A సర్టిఫికేట్‌తో ‘పెద్ది’ రిలీజ్‌కు రెడీ.. 12 ఏళ్లు దాటనోళ్లు మూవీ చూడొచ్చా!

గేమ్ ఛేంజర్ వంటి డిజాస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (PEDDI). ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు రూరల్ రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. వచ్చే నెల జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా మూవీ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే, రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ క్రమంలోనే మూవీ సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ‘పెద్ది’ సినిమాకు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసింది. సెన్సార్ నుంచి క్లియరెన్స్ రావడమే కాకుండా, సినిమా చూసిన అధికార బృందం చరణ్ నటనకు ఫిదా అయ్యారని సమాచారం.

భారీ రన్ టైం..

ఈ సినిమా సుమారు 3 గంటల 9 నిమిషాల (189 నిమిషాలు) రన్‌టైమ్‌తో రూపొందిందని సమాచారం. 1980ల గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, క్రీడలు మరియు భావోద్వేగాల మేళవింపుతో పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని టాక్.   ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయట. ఈ లేటెస్ట్ సెన్సార్ రిపోర్ట్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మెగా విధ్వంసం ఖాయంగా కనిపిస్తోంది. రంగ‌స్థ‌లం తర్వాత రామ్ చరణ్ కెరీర్‌లో ఇంతటి సుదీర్ఘ నిడివితో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

1980ల నాటి కుస్తీ బరి..!

1980ల నాటి గ్రామీణ నేపథ్యం, నాటి మనుషుల పంతాలు, పట్టింపులు, ముఖ్యంగా కుస్తీ (రెజ్లింగ్) క్రీడ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ తన శరీరాకృతిని మరింత ఆకట్టుకునేలా మార్చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో ఆయన రస్టిక్ వింటేజ్ లుక్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్ చూసి సెలబ్రిటీలతో పాటు అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.

►ALSO READ | Jr NTR Quotes: ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్.. స్ఫూర్తి నింపే తారక్ అద్భుతమైన మాటలు

కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, గుండెల్ని పిండేసే బలమైన సెంటిమెంట్ ఈ సినిమాలో హైలైట్ కానుందని టాక్. జూన్ 4న థియేటర్లు స్టేడియంలుగా మారడం.. రికార్డుల వేట మొదలవడం ఖాయం అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

'U/A' సర్టిఫికేట్: ఎవరైనా దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు, కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.