Jr NTR Quotes: ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్.. స్ఫూర్తి నింపే తారక్ అద్భుతమైన మాటలు

Jr NTR Quotes: ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్.. స్ఫూర్తి నింపే తారక్ అద్భుతమైన మాటలు

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బర్త్ డే సందర్భంగా కొత్త విషయాలపై ఫ్యాన్స్ లుక్కేస్తున్నారు. డ్రాగన్ గ్లింప్స్‌తో ఎంజాయ్ చేస్తూనే కొని సర్‌ప్రైజింగ్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్స్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా ఎన్టీఆర్ ఎప్పుడూ తన మనసులోని మాటలను నేరుగా చెప్పే వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నోసార్లు ఇంటర్వ్యూలలోనూ, స్టేజీలపైనా తారక్ చెప్పిన కొన్ని అద్భుతమైన మాటలను గుర్తుచేసుకుందాం.

కమర్షియల్ హీరో ట్యాగ్: ప్రేక్షకులే నా బలం

“నేను ఒక కమర్షియల్ హీరోని, ఆ జానర్‌ను ఎప్పటికీ వదిలిపెట్టను. మాస్ హీరో అనే ఇమేజ్ ఉన్నప్పుడు, ఎక్కువ ప్రయోగాలు చేయాలనుకుంటే కథ మొత్తం దెబ్బతినే అవకాశం ఉంటుంది ” అని ఎన్టీఆర్ అన్నారు. అయితే, ప్రయోగాలు చేయడం మంచిదే కానీ, తనను ప్రేమించే ప్రేక్షకుల అభిరుచిని మరిచిపోవడం కాదు. అభిమానుల అంచనాలు కూడా ఒక బాధ్యతే అని ఆయన నమ్మకం.

మంచి నటుడిగా గుర్తుండాలి..

“నన్ను ప్రజలు గుర్తుంచుకోవాలంటే, ఒక మంచి నటుడిగా గుర్తుపెట్టుకోవాలి. కాలం మారుతున్న కొద్దీ నటులమై మనమూ మారాలి, దానికి అనుగుణంగా ఉండాలి ” అని ఎన్టీఆర్ అన్నారు. స్టార్‌డమ్ తాత్కాలికం కావచ్చు. కానీ ప్రతిభ మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది. పేరు కంటే పనికి గుర్తింపు రావాలనేది ఎన్టీఆర్ భావన.

ఒత్తిడికి మందు: ప్రేమతో చేసే వంట

“నాకు పని ఒత్తిడి పెరిగినప్పుడు, నా భార్య లక్ష్మి ప్రణితి కోసం మంచి వంట చేసిపెడతాను. ఈ విషయం చాలా మందికి తెలియదు కానీ నేను నిజానికి చాలా బాగా వంట చేస్తాను” అని తారక్ చెప్పుకొచ్చాడు. 

►ALSO READ | NTR Dragon Glimpse Talk: 'డ్రాగన్' వర్సెస్ 'సలార్', 'కేజీఎఫ్'.. మళ్లీ అదే బొగ్గు పొడినా?.. ప్రశాంత్ నీల్‌పై ట్రోల్స్!

నిజానికి ఎన్టీఆర్ చెప్పింది కేవలం వంట గురించి కాదు. మనసుకు ప్రశాంతత ఇచ్చేది మనకు ఇష్టమైన పని అని ఆయన చెబుతున్నారు. చిన్న చిన్న ఆనందాలే పెద్ద ఒత్తిడిని దూరం చేస్తాయనేది ఎన్టీఆర్ ఫీలింగ్.

తప్పులు చేశాను.. కానీ నేర్చుకున్నాను

“నా కెరీర్ మొదట్లో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నాను, దాని మూల్యం కూడా చెల్లించాను. అదే తప్పును మళ్లీ చేసే అవకాశం నాకు లేదు” అని ఎన్టీఆర్ చెప్పారు. అయితే, తప్పులు చేయడం తప్పు కాదు. వాటినుంచి నేర్చుకోకపోవడమే అసలు తప్పు. జీవితంలో రెండోసారి అదే పొరపాటు చేయకూడదనే పరిపక్వత ఎన్టీఆర్ మాటల్లో కనిపిస్తుంది.

జీవితం అంటే రోలర్ కోస్టర్

“ జీవితం ఎత్తుపల్లాలతో ఉండాలి.. లేకపోతే అది ఆసక్తికరంగా ఉండదు” అని తారక్ ఫీలింగ్. అంటే, కష్టాలు లేకుంటే సక్సెస్ విలువ తెలియదు. బాధలు లేకుంటే సంతోషం రుచి ఉండదు. జీవితాన్ని ఆస్వాదించాలంటే ప్రతి మలుపునూ స్వీకరించాలి అని ఎన్టీఆర్ మాటలో అర్థం దాగి ఉంది.

సవాళ్లే నటుడిని గొప్పవాడిని చేస్తాయి

“ నటుడిగా నాకు సవాళ్లు ఇష్టం. డిఫెరెంట్ టైప్స్ రోల్స్ చేయాలని కోరుకుంటాను. ప్రేక్షకులు కూడా తమ స్టార్‌ను ఒకే రకమైన పాత్రల్లో పదే పదే చూడడం వల్ల విసుగెత్తిపోతారు” అని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నారు. ఒకే దారిలో నడవడం సులభం. కానీ కొత్త మార్గాల్లో ప్రయాణించడమే ఎదుగుదల. సౌకర్యాన్ని వదిలి కొత్తదాన్ని ప్రయత్నించాలనే ఆలోచన ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది.

లెగసీ అంటే భారం కాదు, గర్వం

“ నాకు వచ్చిన ఈ ప్రెస్టీజియస్ లెగసీని ముందుకు తీసుకెళ్లే అవకాశం దక్కింది. నాకు ఇష్టం లేకపోయినా దాన్నుంచి తప్పించుకోలేను. నాకు లభించిన దానిని ముందుకు తీసుకెళ్లడంలో నేను గర్వపడుతున్నాను ” అనేది ఎన్టీఆర్ భవన.

అంటే వారసత్వం అనేది కేవలం కుటుంబ పేరు కాదు. దానికి న్యాయం చేయడం ఒక బాధ్యత. దానిని గర్వంగా మోసుకెళ్లడమే నిజమైన గొప్పతనం అవుతుందని ఎన్టీఆర్ లెగసీపై కొత్త అర్ధం చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఎన్టీఆర్ మాటల్లో కనిపించేది కేవలం స్టార్ డం కాదు.. జీవితం నేర్పిన అనుభవం, ఆత్మవిశ్వాసం, మరియు ముందుకు సాగాలనే తపన. అందుకే ఆయన మాటలు అభిమానుల గుండెల్లో నిలిచిపోతాయి.