స్పాటిఫైలో సూపర్ ఫీచర్.. సాంగ్ ట్రాన్స్లేషన్ తో భాష తెలియకపోయినా...

స్పాటిఫైలో సూపర్ ఫీచర్.. సాంగ్ ట్రాన్స్లేషన్ తో భాష తెలియకపోయినా...

ఏ ప్రదేశంలో ఉన్నా మనసును హత్తుకునే పాటలు వినాలనిపిస్తే స్పాటిఫై ఆన్​ చేస్తుంటారు చాలామంది. ఈ యాప్​లో అనేక రకాల పాటలు, వివిధ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. భాష తెలియకపోయినా వినాలనిపిస్తుంటాయి కొన్ని సాంగ్స్. అయితే, కొన్నిసార్లు ఆ సాంగ్స్​ మన భాషలో లేకపోయినా దాని భావం తెలిస్తే బాగుండు అనిపిస్తుంది. అందుకే స్పాటిఫై లిరిక్స్ కార్డ్​ మీద ట్రాన్స్​లేటర్ ఫీచర్​ తీసుకొచ్చింది. ఈ సింబల్​పై ట్యాప్ చేస్తే పాట కింద టెక్స్ట్​  ట్రాన్స్​లేట్ అయి కనిపిస్తుంది. 

డివైజ్ లాంగ్వేజ్ సెట్టింగ్స్​ను బట్టి అనువాదం ఆధారపడి ఉంటుంది. అంతేకాదు.. ఆఫ్​లైన్ లిరిక్స్ సపోర్ట్​నూ అందిస్తోంది స్పాటిఫై. యూజర్లు ఆఫ్​లైన్​లో పాట వినడానికి డౌన్​లోడ్ చేసుకున్నప్పుడు లిరిక్స్ కూడా సేవ్ అవుతాయి. ట్రావెలింగ్​లో, ఇంటర్నెట్ సర్వీస్​లు లేని చోట్ల ఇది బాగా పనికొస్తుంది. 

►ALSO READ | ఇది తెలుసా: ఐఫోన్ లో ఫొటోలను వీడియోలుగా..

నౌ ప్లేయింగ్ వ్యూలో లిరిక్ ప్రివ్యూల కోసం కొత్త డిజైన్​ను తీసుకొచ్చింది. ఆల్బమ్ ఆర్ట్ వర్క్ లేదా కాన్వాస్ క్లిప్స్ కింద లిరిక్స్ నౌ అని కనిపిస్తుంది. దీంతో పాట వింటున్నప్పుడు అవే లిరిక్స్ చూడడం ఈజీ అవుతుంది.