Bhimaa Trailer: క‌రుణే చూప‌ని బ్ర‌హ్మ‌రాక్ష‌సుడు..గోపీచంద్ ఊరమాస్ కంబ్యాక్

Bhimaa Trailer: క‌రుణే చూప‌ని బ్ర‌హ్మ‌రాక్ష‌సుడు..గోపీచంద్ ఊరమాస్ కంబ్యాక్

గోపీచంద్ (Gopichand) హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష (Harsha) తెరకెక్కిస్తున్న చిత్రం భీమా (Bhimaa). యూనిక్ యాక్షన్‌‌ ఎంటర్‌‌టైనర్‌‌గా రాబోతున్న ఈ సినిమాను కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్న గోపీచంద్ లుక్, భీమా టైటిల్‌ డిజైన్ అదిరిపోయింది.

లేటెస్ట్గా భీమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. యాక్ష‌న్ అంశాల‌తో ట్రైల‌ర్ గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా, ప‌ర‌శురాముడి గుడిని కాపాడే యోధుడిగా రెండు క్యారెక్ట‌ర్స్‌లో గోపీచంద్ కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది. శివ‌లింగం అభిషేకం సీన్‌తో ట్రైల‌ర్ స్టార్ట్ అవ్వగా..అఘోరాలు క‌నిపించ‌డం..మహావిష్ణుడి ఆరవ అవతారం పరుశురాముడు అంటూ గోపీచంద్ ఎంట్రీ అదిరింది.

ప‌ర‌శురాముడు త‌న గండ్ర గొడ్డ‌లితో అనంత‌సాగ‌రాన్నే వెన‌క్కి పంపి ఒక అద్భుత‌మైన నేల‌ను సృష్టించాడు. అదే ప‌ర‌శురాముడి క్షేత్రం. అక్క‌డ ఆ ప‌ర‌మ‌శివుడే కొలువ‌య్యాడు. కొంద‌రు రాక్ష‌సులు త‌మ అహంకారంతో విర్ర‌వీగుతున్న‌ప్పుడు వాళ్ళ అంతుకోరి త్రినేత్రుడే కాల‌నేత్రుడై క‌రుణే చూప‌ని బ్ర‌హ్మ‌రాక్ష‌సుడిని పంపించాడు అని డైలాగ్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది.

నేను ఊచకోత మొదలుపెడితే ఈ ఊర్లో స్మశానం కూడా సరిపోదు నా కొడకా అని గోపీచంద్ మాస్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. చుట్టూ అడవి..వెంటాడే రాక్షసులు..భయపడే జనాలు..పాడుబడ్డ గుడి..మధ్యలో అఘోరలు ఇవన్నీ కలిపి..ట్రైలర్ తో  సినిమాపై ఆసక్తి కలిగించారు మేకర్స్. 

ఈ సినిమాతో గోపీచంద్ కమ్ బ్యాక్ పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. సలార్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ పై ఇంటెన్స్ కలిగిస్తోంది. ఈ సినిమాలో గోపి చంద్కు జోడీగా మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్‌లు నటిస్తున్నారు. భీమా మహాశివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లో రిలీజ్ కానుంది.