Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు..గుంటూరు కారం ఎన్నో స్థానమంటే?

Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు..గుంటూరు కారం ఎన్నో స్థానమంటే?

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ ఉన్నప్పటికీ..నెట్‌ ఫ్లిక్స్ (Netflix) కు మాత్రం  అత్యధిక సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అంతెందుకు..నెట్‌ఫ్లిక్స్ తర్వాతే మిగతా ఓటీటీస్ అన్నట్లుగా ఉంది. దీనికి కారణం లేకపోలేదు..నెట్‌ఫ్లిక్స్ ఎంచుకునే సినిమాల కంటెంట్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది.

ప్రస్తుతం..నెట్‌ఫ్లిక్స్ లో సినిమా వస్తుందంటే..ఆ సినిమాలో ఏదో బలమైన సందేశం ఐనా..ఎవ్వరికీ తెలియని ఇన్ఫర్మేషన్ ఐనా ఉండేలా స్ట్రాంగ్ బెస్ మెంట్ ఏర్పాటు చేసుకుంది. తెలుగు, బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్, స్పానిష్ అంటూ ఒక భాష, ప్రాంతీయతతో, దేశం సంబంధం లేకుండా అన్ని రకాల మూవీస్, వెబ్ సిరీస్ ఉండటం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ప్రత్యేకత.

లేటెస్ట్గా ఇండియా టుడేలో ఈ వీకెండ్ (ఫిబ్రవరి 24) టాప్ 10 మూవీస్ అంటూ నెట్‌ఫ్లిక్స్ తన ఫ్లాట్‌ఫామ్ సినిమాల లిస్ట్ ప్రకటించింది. వాటిలో షారుక్ ఖాన్ నటించిన డంకీ (Dunki) మూవీ నిలిచింది. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Harani) తెరకెక్కించిన ఈ సినిమాలో తాప్సి (Tapsi) హీరోయిన్ గా నటించింది.

కామెడీ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ సలార్ కు పోటీగా గతేడాది డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ లాంగ్ రన్ లో రూ.470 కోట్లు కలెక్ట్ చేసింది. రీసెంట్గా ఫిబ్రవరి 14న (వాలంటైన్స్ డే) సందర్భంగా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోన్న డంకీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నెంబర్ వన్ ప్లేసులో నిలిచింది. 

భూమి పడ్నేకర్ మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన భక్షక్ (Bhakshak) సినిమాను పులకిత్ దర్శకత్వం వహించారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు.

సంక్షేమ శాఖ వసతి గృహాల్లో బాలికలపై జరిగే లైంగిక వేధింపుల కథాంశంతో వచ్చిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 2 ట్రెండింగ్‌లో నిలిచింది. ఇతరులు కష్టాల్లో ఉంటే బాధపడని వాళ్లు మనుషులు ఎలా అవుతారు..భక్షక్‌లు అవుతారు అనే సందేశంతో వచ్చి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ మూవీ ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.

మూడో స్థానంలో సందీప్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన యానిమల్ (Animal) మూవీ నిలిచింది.అలాగే, హిందీ భాషలో స్ట్రీమ్ అవుతున్న మహేష్ గుంటూరు కారం 4వ స్థానంలో ఉండగా..ఆరో స్థానంలో గుంటూరు కారం తెలుగు వెర్షన్ ఉంది. ఐదవ స్థానంలో డూనే మూవీ ఉంది 

ఏడో స్థానంలో నాని నటించిన హాయ్ పాప హిందీ వెర్షన్ ఉండగా..అట్లీ డైరెక్షన్ లో వచ్చిన షారుక్ జవాన్ మూవీ 8వ స్థానం, ప్రభాస్ సలార్ 9వ స్థానంలో ఉన్నాయి. ఇక పదో స్థానంలో ప్లేయర్స్ మూవీ నిలిచింది.