Ambajipet Marriage Band OTT: అఫీషియల్‌..ఓటీటీలో అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్‌..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

 Ambajipet Marriage Band OTT: అఫీషియల్‌..ఓటీటీలో అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్‌..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ (Suhas) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు(Ambajipeta Marriage Band). యంగ్ బ్యూటీ శివాని నాగారం(Shivani Nagaram) హీరోయిన్గా నటించిన ఈ సినిమాను దర్శకుడు దుశ్యంత్ కటికనేని(Dushyanth Katikaneni) తెరకెక్కించారు.

ఎమోషనల్ అండ్ రస్టిక్ బ్యాక్డ్రాప్ వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రాగా..ఆడియన్స్ నుండి హిట్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో కొల్లగొట్టింది ఈ సినిమా. నిజ జీవితం సంఘటనలతో చాలా సహజంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు ఆడియన్స్. 

థియేటర్స్ ఆడియన్స్ను మెప్పించిన ఈ సినిమా ఇపుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు సంస్థ ఆహా దక్కించుకున్న విషయం తెలిసిందే.
తాజాగా 'మల్లిగాడు' మాయా ప్రపంచంలో పడిపోవడానికి సిద్ధంగా ఉండండి..అతి త్వరలో మీ ముందుకు..అంటూ ఆహా(X)లో పోస్ట్ చేసింది. కానీ,ఇక్కడ స్ట్రీమింగ్ ఎప్పుడనేది మాత్రం  ప్రకటించలేదు.

అయితే, మార్చి1నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మొన్నటి వరకు మార్చి 8న లేదా మార్చి 15న స్ట్రీమింగ్‌ చేస్తారని టాక్ వినిపించింది. మరి థియేటర్స్లో మంచి విజయం సాధించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.