మెడికల్ టూరిజంలో హైదరాబాద్‌‌‌‌ను గ్లోబల్ హబ్‌‌‌‌గా మారుస్తం : మంత్రి దామోదర్ రాజనర్సింహ

మెడికల్ టూరిజంలో హైదరాబాద్‌‌‌‌ను గ్లోబల్ హబ్‌‌‌‌గా మారుస్తం : మంత్రి దామోదర్ రాజనర్సింహ
  • గ్లోబల్ సమిట్ లో ప్రైవేట్ హాస్పిటళ్లు పాల్గొనాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య రంగంలో తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్ది, మెడికల్ టూరిజంలో హైదరాబాద్‌‌‌‌ను గ్లోబల్ హబ్‌‌‌‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. శుక్రవారం ఆయన సెక్రటేరియెట్‌‌‌‌లో జరిగిన గ్లోబల్ సమిట్ హెల్త్‌‌‌‌కేర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో వైద్య సేవలు, నైపుణ్యాల పెంపు, ప్రైవేటు భాగస్వామ్యంపై అధికారులతో చర్చించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ..గ్లోబల్ సమిట్ విజయవంతానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, ఆసుపత్రుల యాజమాన్యాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రైవేటుతోపాటు సనత్‌‌‌‌నగర్, అల్వాల్, కొత్తపేట టిమ్స్‌‌‌‌, నిమ్స్‌‌‌‌లలో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం వార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్న వైద్యుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. రోగుల సేవలను ఒకే వ్యవస్థ కిందకు తేవాలని అభిప్రాయపడ్డారు.