స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.. తెలంగాణ, ఏపీలోని 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.. తెలంగాణ, ఏపీలోని 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

హైదరాబాద్: స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు చేసింది. తెలంగాణ, ఏపీలోని 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. తెలంగాణ, ఏపీలోని 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ సహా పలు చోట్ల సంస్థ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.

హైదరాబాద్ కొండాపూర్ కేంద్రంగా పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ రంగాల్లో స్నేహ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్లు రామ్ రెడ్డి డెండి, వరుణ్ రెడ్డి డెండి, స్నేహ డెండి నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. 1982లో  రామ్ రెడ్డి చికెన్ మార్కెట్‌గా ప్రారంభమై.. 1994లో స్నేహ ఫామ్స్‌గా ఈ సంస్థ విస్తరించింది.

పౌల్ట్రీ బ్రీడింగ్, చికెన్ ప్రాసెసింగ్, పశువుల దాణా, వంట నూనెల (సఫల బ్రాండ్) తయారీలో స్నేహ గ్రూప్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో గంటకు 12,000 కోళ్లను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉన్న ఆటోమేటెడ్ ప్లాంట్ను ఈ సంస్థ నిర్వహిస్తుంది. 2,000 మందికి పైగా కాంట్రాక్ట్ రైతులతో కలిసి వ్యాపారం.. భారత రక్షణ సంస్థలకు (డిఫెన్స్) ఫ్రోజెన్ చికెన్ సరఫరా చేస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో సింగ్ పౌల్ట్రీని స్నేహ గ్రూప్ కొనుగోలు చేసింది.