కొంపల్లిలో కారు బీభత్సం..అదుపు తప్పి ఢీకొట్టడంతోఆటో డ్రైవర్ మృతి

కొంపల్లిలో కారు బీభత్సం..అదుపు తప్పి ఢీకొట్టడంతోఆటో డ్రైవర్ మృతి
  •     మరో నలుగురికి గాయాలు

కుత్బుల్లాపూర్, వెలుగు: పేట్​బషీరాబాద్​ పీఎస్​పరిధిలో అదుపు తప్పిన ఓ కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్​ చనిపోగా, నలుగురికి గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున ఓవర్​ స్పీడ్​తో వచ్చిన ఓ కారు కొంపల్లిలోని సౌత్​ఇండియన్ ​షాపింగ్ ​మాల్ ​యూటర్న్​ వద్ద ఓ ఆటోను ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో ఆటోడ్రైవర్​ అక్కడికక్కడే చనిపోగా, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

కారు అతివేగంతో  ఆగకుండా వెళ్లి మరో కారును, టాటా ఏస్​ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. పేట్​బషీరాబాద్​ ఎస్సై మహేశ్వర్​రెడ్డి  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.