- మరొకరికి గాయాలు
- ఇద్దరూ టెక్నీషియన్లే..
గచ్చిబౌలి, వెలుగు : లిఫ్ట్ రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా కదలడంతో మరమ్మతులు చేస్తున్న యువకుడు చనిపోగా, మరొకరు గాయపడ్డారు. మెట్టుగూడకి చెందిన రంగోళ్ల మనోహర్(19) టీకేఈ ఎలివేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే లిఫ్ట్ కంపెనీలో టెక్నీషియన్ . ఇదే కంపెనీలో పనిచేసే మరో టెక్నీషియన్ అల్లూరి వాసుతో కలిసి గురువారం నానక్రామ్గూడలోని ఎస్ఏఎస్ బిల్డింగ్లో లిఫ్ట్ మెయింటెనెన్స్ వర్క్ చేసేందుకు వెళ్లారు.
రెండో అంతస్తులో రిపేర్ చేస్తుండగా.. లిఫ్ట్ ఒక్కసారిగా పైకి కదిలింది. ఇద్దరూ లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయారు. మనోహర్ తీవ్రంగా గాయపడడడంతో గచ్చిబౌలిలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయాడు. గాయపడ్డ అల్లూరి వాసు చికిత్స పొందుతున్నాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
