ట్రేడ్ లైసెన్స్‌‌ రెన్యూవల్‌‌ లేటైతే ఫైన్..నవంబర్ 30లోపు చేస్కోకపోతే 25 నుంచి 50 శాతం జరిమానా

ట్రేడ్ లైసెన్స్‌‌ రెన్యూవల్‌‌ లేటైతే ఫైన్..నవంబర్ 30లోపు చేస్కోకపోతే  25 నుంచి 50 శాతం జరిమానా
  • లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే 100 శాతం పడుద్ది..
  •     ఆపై ప్రతి నెలా 10 శాతం అదనం 

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లైసెన్స్​రెన్యూవల్​చేసుకోకుండా వ్యాపారాలు చేస్తున్న వారికి జీహెచ్‌‌ఎంసీ హెచ్చరిక జారీ చేసింది. 2027 సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్‌‌ల రెన్యూవల్‌‌కు నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఈలోగా లైసెన్స్‌‌లను పునరుద్ధరించుకోకపోతే అదనపు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గడువు దాటిన ప్రతి దశలో జరిమానాలు పెరుగుతాయని పేర్కొంది.  ప్రస్తుతం వ్యాపారులు పొందిన 2026 సంవత్సరపు ట్రేడ్ లైసెన్స్‌‌ల గడువు డిసెంబర్ 31తో ముగియనున్నది. 

2027 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వ్యాపార కార్యకలాపాలు కొనసాగించాలంటే ముందుగానే లైసెన్స్‌‌లను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 30లోపు దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి జరిమానాలు ఉండవు. డిసెంబర్ 1 నుంచి 2027 జనవరి 31 వరకు రెన్యూవల్ చేసుకుంటే 25 శాతం, ఫిబ్రవరి 1 నుంచి అయితే 50 శాతం జరిమానాలు విధించనున్నారు. 

లైసెన్స్​ లేకపోతే 100 శాతం ఫైన్​

ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించే వారితో జీహెచ్​ఎంసీ మరింత కఠినంగా వ్యవహరించనున్నది. అలాంటి వ్యాపారాలను గుర్తిస్తే 100 శాతం జరిమానా విధించడంతోపాటు, లైసెన్స్ పొందే వరకు ప్రతి నెలా అదనంగా 10 శాతం ఫైన్​వేయనున్నది. వ్యాపారులు జీహెచ్‌‌ఎంసీ  అధికారిక వెబ్‌‌సైట్, మై క్యూర్ యాప్, మీ-సేవా కేంద్రాలు, కస్టమర్ సర్వీసు సెంటర్ల ద్వారా రెన్యూవల్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా నవంబర్ 30లోపు లైసెన్స్‌‌లను పునరుద్ధరించుకోవాలని కమిషనర్ వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.