చెన్నైలో రూ.700 కోట్ల హెరాయిన్ సీజ్

చెన్నైలో రూ.700 కోట్ల హెరాయిన్  సీజ్

చెన్నై: తమిళనాడులోని చెన్నై శివారు ప్రాంతమైన మాధవరంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు భారీ డ్రగ్స్​రాకెట్‌‌‌‌ను ఛేదించారు. విదేశాల నుంచి మాదకద్రవ్యాలు అక్రమ రవాణా అవుతున్నాయన్న పక్కా సమాచారంతో గత సోమవారం రాత్రి నుంచే డీఆర్ఐ బృందాలు చెన్నై విమానాశ్రయ పరిసరాలు, చెన్నై–--తిరుచ్చి, చెన్నై-–కోల్‌‌‌‌కతా జాతీయ రహదారులపై నిఘా పెట్టాయి. మంగళవారం ఒక ఐస్‌‌‌‌క్రీమ్ విక్రయ వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీలు చేశాయి. 

వాహనంలోని ఫ్రీజింగ్ యూనిట్‌‌‌‌లో, ఐస్‌‌‌‌క్రీమ్ నిల్వ చేసే రాక్‌‌‌‌ల మధ్య దాచి ఉంచిన అనేక హెరాయిన్ ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. సుమారు రూ.700 కోట్ల విలువైన 70 కిలోల హెరాయిన్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న ఇద్దరు నిందితులు అబ్దుల్ షుకూర్, షఫీక్ అహ్మద్ లను అరెస్ట్​చేశారు. వీరిద్దరూ దక్షిణ తమిళనాడుకు చెందినవారని తేల్చారు. విచారణలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ సరుకును తమకు అప్పగించి, వేరే ప్రాంతానికి తరలించాలని సూచించారని నిందితులు తెలిపారన్నారు.