- ప్రభుత్వ కాలేజీలకు రూ.1.77 లక్షలు
- ప్రైవేట్, డీమ్డ్ సంస్థలకు 3.54 లక్షలు
హైదరాబాద్, వెలుగు: నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మెడికల్ కాలేజీల అప్పీల్ ఫీజును భారీగా పెంచింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని కమిషన్ సెక్రటరీ డాక్టర్ రాఘవ్ లంగర్ పబ్లిక్ నోటీసులిచ్చారు. సవరించిన ఫీజుల ప్రకారం.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రూ. 1.77 లక్షలు (18% జీఎస్టీతో కలిపి), ప్రైవేట్, డీమ్డ్ విద్యాసంస్థలు రూ. 3.54 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫీజు రూ. 59 వేలుగా ఉండేది. ఎంఏఆర్బీ, యూజీఎంఈబీ, పీజీఎంఈబీ నిర్ణయాలపై అప్పీల్ చేసే విద్యాసంస్థలు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని కమిషన్ తెలిపింది.
