హెచ్సీయూలో ఫుడ్ పాయిజన్..40 మంది విద్యార్థులకు అస్వస్థత

హెచ్సీయూలో ఫుడ్ పాయిజన్..40 మంది విద్యార్థులకు అస్వస్థత

 గచ్చిబౌలి, వెలుగు  : హైదరాబాద్​ సెంట్రల్ ​యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్​ జరిగింది. గురువారం రాత్రి భోజనం చేసిన 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం విద్యార్థులందరికీ వర్సిటీలోని హెల్త్​ సెంటర్​లో ట్రీట్​మెంట్ చేస్తున్నారు. గురువారం రాత్రి వర్సిటీలో ఉన్న మెన్స్​ హాస్టల్​  ఈ,  ఎమ్​ లో విద్యార్థులు అన్నం, పప్పుతో భోజనం చేశారు. శుక్రవారం ఉదయం నుంచి ఒక్కొక్కరుగా కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వర్సిటీ హెల్త్​ సెంటర్​లో జాయిన్​ చేశారు. 

ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. వర్సిటీ వైస్​ఛాన్స్​లర్​, రిజిస్ట్రార్ ​ఫుడ్​ పాయిజన్​పై ఆరా తీశారు. ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. వర్సిటీకి వెంటనే పర్మినెంట్​ న్యూట్రీషన్​అఫీసర్​ను నియమించాలని,  క్రమం తప్పకుండా ఆహార తనిఖీలు నిర్వహించాలని డిమాండ్​ చేశాయి.