నవంబర్ 24న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు అమిత్ షా.. 

నవంబర్ 24న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు అమిత్ షా.. 
  • ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొననున్న కేంద్ర మంత్రి 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 24న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రానున్నారు. ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చానల్ నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సుమారు మూడు గంటల పాటు ఈ పర్యటన సాగనున్నది. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం 5.40 గంటలకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బేగంపేట ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుకు వస్తారు.

అక్కడి నుంచి హోటల్ ఐటీసీ కాకతీయకు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఆయన ఉంటారు. అనంతరం రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చానల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆయన 8.50కు బేగంపేట ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. అయితే, ఐటీసీ కాకతీయలో ఉండే గంట సమయంలో బీజేపీ ముఖ్యనేతలతో పాటు పలువురు ప్రముఖులను ఆయన కలిసే ఉందని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి.

25న సిద్దిపేటకు జేపీ నడ్డా.. 

ఈ నెల 25న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సిద్దిపేటకు రానున్నారు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో జరిగే మహా పాదయాత్రలో ఆయన పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానున్నది.