హైదరాబాద్ సిటీ, వెలుగు: సూరారం, సాయిబాబానగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నది. సూరారం చెరువు నుంచి శివాలయనగర్‌లోని 14 ఎంఎల్‌డీ ఎస్టీపీ వరకు చేపట్టిన 800 ఎంఎం సీవరేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనులు 95 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనుల్లో భాగంగా తాగునీటి పైప్‌లైన్ మార్చాల్సి ఉంది. దీంతో సూరారం మెయిన్‌రోడ్డుపై మల్లారెడ్డి దవాఖాన ఎదురుగా ఉన్న 700 ఎంఎం డయా పైప్‌లైన్ మార్చనున్నారు. ఈ పనులు శనివారం రాత్రి 9 గంటల నుంచి నవంబర్ 22 ఆదివారం రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి.
దీంతో 24 గంటల పాటు ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా లేదా పాక్షికంగా నిలిచిపోనున్నది. అలాగే, సూరారం వార్డులోని విశ్వకర్మ కాలనీ, వైష్ణవి నగర్, వేమారెడ్డి నగర్, లక్ష్మీనగర్, సూరారం విలేజ్‌తో పాటు సాయిబాబానగర్ వార్డులోని తెలుగు తల్లి నగర్, జై భీమ్ నగర్, మైత్రీ నగర్, సూరారం కాలనీలపై ప్రభావం పడనున్నది.
