Saripodhaa Sanivaaram: పద్ధతైన కోపం చూపించే పిచ్చినా కొడుకు.. సరికొత్తగా సరిపోదా శనివారం టీజర్

Saripodhaa Sanivaaram: పద్ధతైన కోపం చూపించే పిచ్చినా కొడుకు.. సరికొత్తగా సరిపోదా శనివారం టీజర్

నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram). దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek Athreya) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మొహనన్(Priyanka Mohanan) హీరోయిన్ గా నటిస్తున్నారు. దీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ నటుడు SJ సూర్య కీ రోల్ చేస్తున్నారు. అంటే సుందరానికి వంటి సినిమా తరువాత  నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో సరిపోదా శనివారంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 

తాజాగా ఫిబ్రవరి 24 నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్బంగా సరిపోదా శనివారం నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చాలా కొత్తగా అనిపిస్తోంది. కోపం అనేది ఒక్కో మనిషిలో ఒక్కో రకంగా ఉంటుంది. కానీ, ఆ కోపాన్ని కూడా క్రమబద్ధంగా, పద్దతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చినా కొడుకుని ఎవరైనా చూశారా? నేను చూశా. వాడి పేరు సూర్య.. రోజు శనివారం.. అంటూ SJ సూర్య చెప్పిన డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. అంతేకాదు నాని లుక్స్ కూడా సరికొత్తగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.  

ఇక మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. మరి మంచి అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.