హైదరాబాద్, వెలుగు: ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరిస్తాయని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. సీపీఐ స్టేట్ ఆఫీసు మక్దూం భవన్‌లో రెండ్రోజుల పాటు జరిగిన రాష్ట్ర సమితి సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పొత్తులు కేవలం ఎన్నికల వరకు మాత్రమే పరిమితమని, ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించాల్సిందేనన్నారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండటం సీపీఐ బలమని, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
