ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక : సర్పంచులు, కౌన్సిలర్లకు  శిక్షణ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక : సర్పంచులు, కౌన్సిలర్లకు  శిక్షణ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు

వనపర్తి, వెలుగు :  ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లకు గురువారం నిర్వహించనున్న ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అడిషనల్​ కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు.

బుధవారం స్థానిక కల్యాణ సాయి గార్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, జడ్పీ సీఈఓ యాదయ్య, ఇతర అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. జిల్లాలోని మున్సిపాలిటీల చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, సర్పంచులకు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు అవగాహన కల్పిస్తారని తెలిపారు.