అమెరికా ఇరాన్ మధ్య సోమవారం శాంతి చర్చలు ప్రారంభం అవుతున్న వేళ బులియన్ మార్కెట్లు వెయిట్ అండ్ వాట్ మోడ్ లోకి వెళ్లాయి. గత కొన్ని వారాలుగా పెరుగుతూ తగ్గుతూ అక్కడక్కడే తిరుగుతున్న బంగారం రేట్లు ఈవారం స్థిర ప్రారంభాన్ని నమోదు చేశాయి.
ఆగస్టు 3న బంగారం రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఆగస్టు 2 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నాయి. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 422గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 220గా కొనసాగుతోంది.
ALSO READ : ఐటీ ఉద్యోగులకు షాక్.. బెంచ్ రూల్స్ మార్చేసిన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్!
సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 3, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 35వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.235 దగ్గర ఉంది.
