సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో రంగం కార్యక్రమం జరిగింది. అమ్మవారికి పూజలు చేసిన మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. విగ్రహ ప్రతిష్ఠ విషయంలో ప్రతి సంవత్సరం మాట తప్పుతున్నారని.. అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆరు నెలల్లోగా విగ్రహ ప్రతిష్ఠ జరుగకపోతే అడ్డొచ్చినవారిని నలిపేస్తానని.. వాడ వాడలా ప్రాణనష్టం జరుగుతుందన్నారు. నా విగ్రహ ప్రతిష్ట చేస్తే మీరు కోరిందల్లా చేస్తానన్నారు.
ఈ ఏడాది సంతోషంగా రాలేదంటూ.. మీరు అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలన్నారు. క్రోధంతో వచ్చానంటూ.. ఈ ఏడాది ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతుందని.. కుంభవృష్టి కురుస్తుందని.. జనాలు కొట్టుకుపోతారని.. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయని .. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని భవిష్యవాణిలో స్వర్ణలత చెప్పారు.
ALSO READ : భవిష్యవాణి: కుంభవృష్టి కురుస్తుంది.. ప్రాణనష్టం ఎక్కువుగా ఉంటుంది
ప్రజలకు అహంకారం ఎక్కువైందని.. వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ.. అలాంటి వారివలన ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. మీరు నామాట వినడం లేదని.. మీరు చేసే చర్యలతో నాకు ఆగ్రహం వస్తుందని.. మీకు దోసెడంత ఇచ్చినా..నాకు గోరంత ఇవ్వడం లేదని భవిష్యవాణి వినిపించారు.
