భవిష్యవాణి: కుంభవృష్టి కురుస్తుంది.. ప్రాణనష్టం ఎక్కువుగా ఉంటుంది

భవిష్యవాణి:  కుంభవృష్టి కురుస్తుంది.. ప్రాణనష్టం ఎక్కువుగా ఉంటుంది

సికింద్రాబాద్​ మహంకాళీ అమ్మవారి లష్కర్​ బోనాల ఉత్సవాల్లో  కీలక ఘట్టం రంగం కార్యక్రమం వైభవంగా జరిగింది.  మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.  కన్నుల పండువగా సాగిన కార్యక్రమంలో భక్తులు భారీగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో మాతంగి స్వర్ణలత ప్రత్యేక పూజలు నిర్వహించారు.రంగం కార్యక్రమానికి మంత్రి పొన్నం హాజరయ్యారు. రంగం కార్యక్రమాన్ని తిలకించడానికి భారీగా భక్తులు వచ్చారు

రంగం.. భవిష్యవాణి  వివరాలు

  • నేను సంతోషంగా రాలేదు... క్రోధంగా వచ్చానని భవిష్యవాణిలో అమ్మవారి రూపంలో ఉన్న స్వర్ణలత వినిపించారు. ఇంతవరకు నా విగ్రహ ప్రతిష్ఠ చేయలేదని అమ్మవారు తెలిపారు.  భక్తుల కోర్కెల మేరకు  అందరినీ కాపాడుతున్నానన్నారు.
  • ఎవరు అడ్డుపుల్ల వచ్చినా నా విగ్రహ ప్రతిష్ట జరగాల్పిందేనని.. అలాంటి వారికి చుక్కలు చూపిస్తానని భవిష్యవాణిలో తెలిపారు.
  • ఈ ఏడాది కూడా కుంభ వర్షాలు వస్తాయని.. కొట్టుకుపోయే ప్రమాదాలున్నాయి... అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయి.. ప్రాణ నష్టం బాగా జరుగుతుందన్నారు.
  • ప్రజలు వావి వరుసలు మరచి ఘోరాలు చేస్తారని.. అందువల్లే ప్రాణ నష్టం జరుగుతుందని భవిష్యవాణి తెలిపారు.
  • ఈ ఏడాది నాకు చాలా  బాధగా ఉందని..భక్తులకు ఏ ఆ పద వచ్చినా కాపాడుతున్నానని  మాతంగి స్వర్ణలత భవిష్యవాణి తెలిపారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.
  • ఈ ఏడాది నన్ను చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు.  మీ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలన్నారు.  నా విగ్రహ ప్రతిష్ట చేస్తే కోరిన కోర్కెలు వేయిరెట్లు ఫలిస్తాయి.
  •  ఆరు నెలలలోపుగా విగ్రహ ప్రతిష్ఠ జరిపించకపోతే...అడ్డొచ్చిన వారిని నలిపేస్తానని స్వర్ణలత భవిష్యవాణి తెలిపారు. కచ్చితంగా ఆరు నెలలలోపుగా చేయాలన్నారు.