గోదావరిఖని: గ్యాస్ సిలిండర్ పేలి.. దంపతులకు తీవ్ర గాయాలు

గోదావరిఖని: గ్యాస్ సిలిండర్ పేలి.. దంపతులకు తీవ్ర గాయాలు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్​ పోలీస్​స్టేషన్​పరిధిలోని యైటింక్లయిన్​ కాలనీలోని పోతన కాలనీ 83వ బ్లాక్ లోని ఓ ఇంట్లో ఆదివారం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వకీల్‌పల్లి గనిలో పనిచేస్తున్న యాదవనేని వసంత్ ఆదివారం తన ఇంట్లో ఉండగా లీకేజీ కారణంగా గ్యాస్​ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. 

ఈ ఘటనలో వసంత్‌తో పాటు ఆయన భార్య విజ్ఞత తీవ్రంగా గాయపడ్డారు. వారిని  వెంటనే స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. క్వార్టర్​లోని మరో గదిలో ఉన్న వారి ఇద్దరు పిల్లలను స్థానికులు క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. టూటౌన్ ​ఇన్​స్పెక్టర్ ​ప్రసాదరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల వద్ద వివరాలు సేకరించి విచారణ చేపట్టామని తెలిపారు.