సికింద్రాబాద్‌లో జోగిని శ్యామల ఆధ్వర్యంలో మావురాల పెద్దమ్మతల్లి ఆలయం నుంచి ఉజ్జయిని ఆలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు.మార్గమధ్యలోని బాటా కమాన్ వద్దకు చేరుకోగానే పోలీసులు జోగిని శ్యామలను అడ్డుకున్నారు.
పోలీసుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ జోగినీలు పోలీస్ డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ శాంతియుత నిరసనను కొనసాగిస్తూ జోగినిలు ఉజ్జయిని ఆలయ ప్రాంతానికి చేరుకున్నారు.
ALSO READ : ఆరు నెలల్లోపు విగ్రహ ప్రతిష్ఠ జరగాల్సిందే.. అడ్డొచ్చిన వారిని నలిపేస్తా..!
చివరకు పోలీసులు జోగినిల ధర్నాను విరిమింపజేసి, బాటా కమాన్ నుండి వారిని ఆలయం లోపలికి అనుమతించారు. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి జోగినిలతో చర్చించేందుకు పోలీసులు అవకాశం కల్పించారు.
