నాగార్జున హీరోగా తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నాగ్ కెరీర్‌లో ఇది వందో సినిమా. ఎలాంటి అప్‌డేట్స్ లేకుండా సైలెంట్‌గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. నాగార్జున కూడా ఎక్కడా ఈ చిత్రం గురించి అంతగా రివీల్ చేయలేదు. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు రా.కార్తీక్ ఈ ప్రాజెక్ట్ గురించి తొలిసారి తమిళ మీడియాతో మాట్లాడాడు.
షూటింగ్ నాన్‌స్టాప్‌గా జరుగుతోందని చెప్పిన కార్తీక్.. ఇందులో నాగార్జున సూపర్ స్టైలిగ్‌గా కనిపించబోతున్నారని అన్నాడు. శివ, రక్షకుడు, కూలీ సినిమాల్లో ఆయన ఎలా స్టైలిష్‌గా కనిపించారో, అంతే హ్యండ్సమ్ లుక్‌లో ఇందులోనూ కనిపించనున్నారని చెప్పాడు. అంతేకాదు ఇందులో ఆయన మల్టిపుల్ గెటప్స్‌లో కనిపిస్తారని కూడా రివీల్ చేశాడు.
వందో సినిమాకు తెలుగు డైరెక్టర్‌ను కాకుండా తమిళ దర్శకుడినైన తనను ఎందుకు ఎంచుకున్నారని నాగార్జునను అడిగానని, అందుకు ‘నీతో నాకు ఓకే’ అని ఆయన చెప్పినట్టు కార్తిక్ వెల్లడించాడు. టబు కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది.
