ఢాకా: టీ20 వరల్డ్ కప్‌లో చెత్తాటతో విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ వన్డే ఫార్మాట్‌లోనూ నిరాశపరుస్తోంది. బంగ్లాదేశ్ టూర్‌ను ఆ జట్టు ఘోర ఓటమితో ప్రారంభించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లా 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన పాక్ 30.4 ఓవర్లలో 114 రన్స్‌కే కుప్పకూలింది. ఫహీమ్ అష్రఫ్ (37), సాహిబ్జాదా ఫర్హాన్ (27) టాప్ స్కోరర్లు.
బంగ్లా బౌలర్లు నహిద్ రాణా (5/24), మెహిదీ హసన్ మిరాజ్ (3/29) దెబ్బకు జట్టులో ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. అనంతరం బంగ్లా 15.1 ఓవర్లలోనే 115/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ (67 నాటౌట్) ఫిఫ్టీతో సత్తా చాటాడు. నహిద్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం జరుగుతుంది.
