తెలుగు ప్రజల మధ్య విభేదాలు సృష్టించొద్దు..శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్ 

తెలుగు ప్రజల మధ్య విభేదాలు సృష్టించొద్దు..శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్ 

న్యూఢిల్లీ, వెలుగు: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేధాలు సృష్టించవద్దని టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలును ఎంపీ చామల హెచ్చరించారు. తెలుగురాష్ట్రాలు విడిపోయినప్పటికీ సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఎవరి ప్రసన్నం కోసమో ప్రజల సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు.