తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి.. రేవంత్ రెడ్డి సర్కార్ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల కుటుంబాలకు కొండంత ఆర్థిక భరోసా కల్పిస్తూ.. సరికొత్త ఎంప్లాయీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ జూన్ 25న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక బీమా పథకం ప్రారంభం కాబోతోంది.
ఈ పథకం ద్వారా.. ప్రమాద వశాత్తూ మరణించినా లేదా శాశ్వత వైకల్యం సంభవించినా.. ఏకంగా రూ. 1 కోటి నుంచి రూ. 1.5 కోట్ల వరకు భారీ ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది. ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే..ఈ బీమా రక్షణ ఏకంగా 3 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
ఈ పథకంలో మరో అద్భుతమైన విషయం ఏమిటంటే..కేవలం రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే కాదు.. కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా ఈ ప్రమాద బీమా ప్రయోజనాలు వర్తిస్తాయి. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు , వారి కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
