పేరు చెప్పండి.. లక్ష గెలుచుకోండి! ..హౌసింగ్ బోర్డు ఆఫర్

పేరు చెప్పండి.. లక్ష గెలుచుకోండి! ..హౌసింగ్ బోర్డు ఆఫర్
  • ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐజీ హౌసింగ్ స్కీంకు ‘పేరు’ కోసం పోటీ
  • ఈ నెల 28 వరకు సోషల్ మీడియాలో ఎంట్రీలు
  • ఉత్తమ పేరుకు రూ. లక్ష బహుమతి
  • హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్

హైదరాబాద్, వెలుగు: అల్పాదాయ వర్గాల (ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐజీ) కోసం క్యూర్ ఏరియాలో ప్రతిపాదించిన లక్ష ఫ్లాట్ల నిర్మాణ పథకానికి మంచి పేరు సూచించాలని ప్రజలను హౌసింగ్ బోర్డు కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పథకానికి ప్రజలు సూచించిన పేరునే ఖరారు చేయాలని నిర్ణయించింది. ప్రజలు పంపిన పేర్లలో ఉత్తమమైనదాన్ని ఎంపిక చేసి, ఆ పేరును సూచించిన వారికి రూ. లక్ష బహుమతి అందజేస్తామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఈ నెల 28 వరకు బహిరంగ పోటీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హౌసింగ్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ https://tghousing.cgg.gov.in/ , https://www.instagram.com/p/DZ6mCF_E1PY/  పేజీ ద్వారా పోటీలో పాల్గొనవచ్చని వివరించారు. అందుబాటు ధరల్లో, ఎటువంటి వివాదాలు లేకుండా వివిధ వర్గాల ప్రజల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత హౌసింగ్ బోర్డుకు ఉందని ఆయన గుర్తుచేశారు. బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులకు ప్రజాదరణతో పాటు డిమాండ్ కూడా ఉందని పేర్కొన్నారు.

సుదీర్ఘ విరామం తరువాత చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ప్రజలను కూడా భాగస్వామ్యులను చేయాలన్న ఆలోచనతోనే ప్రజల నుంచి పేరుని స్వీకరిస్తున్నామని గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. క్యూర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐజీ ఫ్లాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన భూములను ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, లాటరీ పద్ధతిలో ఇండ్లను కేటాయిస్తామని, పూర్తి విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని వీపీ గౌతమ్ పేర్కొన్నారు.