స్కూళ్ల తనిఖీలకు అకడమిక్ టీమ్స్ రెడీ

స్కూళ్ల తనిఖీలకు అకడమిక్ టీమ్స్ రెడీ
  • టీచింగ్ మెథడ్స్ పర్యవేక్షణ, టీచర్లకు గైడెన్స్ ఇవ్వడమే పని
  • వంద ప్రైమరీ స్కూళ్లకు ఒకటి.. 50 హైస్కూళ్లకో టీమ్ ఏర్పాటు
  • ఎఫ్ఎల్ఎన్ స్కూళ్లపై స్పెషల్ ఫోకస్..  
  • రిపోర్ట్స్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాలని విద్యాశాఖ ఆదేశం

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 2026-–27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాస్థాయి అకడమిక్ ప్యానెల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్షన్ టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో బోధనా పద్ధతులను పర్యవేక్షించడం, టీచర్లకు అవసరమైన సూచనలు ఇవ్వడం ఈ టీముల ముఖ్య ఉద్దేశం. స్కూళ్ల సంఖ్య  ఆధారంగా ఈ ప్యానెల్ బృందాలను ఏర్పాటు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు.

కొత్త గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ ప్రకారం.. ప్రతి వంద ప్రైమరీ స్కూళ్లకు ఒక ప్యానెల్ టీమ్, ప్రతి వంద అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు ఒక టీమును ఏర్పాటు చేయనున్నారు. అయితే, 50 హైస్కూళ్లకు ఒక టీము చొప్పున ఏర్పాటు చేయబోతున్నారు. ఈ టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంపికైన హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాస్టర్లు, టీచర్లు పూర్తిస్థాయిలో తనిఖీ విధుల్లోనే ఉంటారు. అయితే, వారు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న స్కూళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ స్థానాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డీఈఓలను డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు.

ఎఫ్ఎల్ఎన్ స్కూళ్లపై స్పెషల్ ఫోకస్..

ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి క్లస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఉన్న మూడు స్కూళ్లను ‘ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ స్కూల్స్’గా విద్యాశాఖ గుర్తిస్తోంది. ఈ స్కూళ్లను ప్యానెల్ బృందాలు నెలకోసారి తప్పనిసరిగా విజిట్ చేసి, అక్కడి విద్యార్థులు లక్ష్యాలను రీచ్ అయ్యేలా టీచర్లకు అకడమిక్ సపోర్ట్ అందించాల్సి ఉంటుంది. మండల స్థాయి రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఈ టీమ్స్ మంత్లీ రిపోర్ట్స్ సమర్పించాలి. డీఈఓలు ఈ బృందాల వివరాలను వెంటనే ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాలని డైరెక్టర్ స్పష్టం చేశారు.

తనిఖీల్లో ఏం చేస్తారంటే.. 

ప్యానెల్ సభ్యులు తమకు కేటాయించిన స్కూళ్లను సందర్శిస్తారు. ప్రతి విజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనీసం రెండు సబ్జెక్టుల బోధనను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. టీచర్లకు ఫీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్ ఇస్తారు. ప్రతి రెండు నెలలకోసారి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో స్పాట్ అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ నిర్వహిస్తారు. తనిఖీ వివరాలను అదే రోజున 'తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్' లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అకడమిక్ గైడెన్స్ రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ఈ డేటాను రికార్డు చేయాల్సి ఉంటుంది.